Salaar: రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. 'సలార్'లో ప్రభాస్ డబుల్ రోల్.. 1000మందితో ఫైటింగ్ సీన్..!

Prabhas Will Play a Double Role in Salaar Movie Prashanth Neel
x

Salaar: రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. 'సలార్'లో ప్రభాస్ డబుల్ రోల్.. 1000మందితో ఫైటింగ్ సీన్..!

Highlights

Salaar: 'KGF' సిరీస్‌తో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ' సలార్ ' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Salaar: 'KGF' సిరీస్‌తో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ' సలార్ ' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి దగ్గర పడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సినిమా షూటింగ్ లొకేషన్‌ని సందర్శించిన ఒక అభిమాని ఓ సన్నివేశాన్ని చూసి ఫ్యాన్స్‌కు ఒళ్లు పులకరించే లాంటి న్యూస్ అందించాడు. 'సలార్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక ప్రత్యేక సన్నివేశంలో, ఒక ప్రభాస్ పాత్ర వెయ్యి మంది శత్రువులతో పోరాడనున్నట్లు సోషల్ మీడియా వేదికగా న్యూస్ అందించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతనిని రక్షించడానికి మరో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇవ్వనుందంట. దీంతో ఈ సన్నివేశం వెట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉండనుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా కథను లీక్ కాకుండా సలార్ బృందం అదనపు జాగ్రత్తలు తీసుకుంది. నివేదికల ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని బస్రూర్‌కి మార్చారు. ఇది సినిమా కథాంశాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలోనే జరిగిందంట. రవి బస్రూర్ స్టూడియోలో జాగ్రత్తగా మిగతా వర్క్‌ని రూపొందిస్తున్నారు.

విజయ్ కిరగందూర్ నిర్మాతగా సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో, ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం రెండు ఉత్కంఠభరితమైన భాగాలలో రానుంది. ప్రస్తుతానికి, మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories