Ustaad Bhagat Singh Glimpse: పర్ఫార్మెన్స్ బద్దలే.. పాత బస్తీ పోలీస్ గా పవన్..

Pawan Kalyan Ustaad Bhagat Singh Massive First Glimpse Launched in Sandhya Theatre
x

Ustaad Bhagat Singh Glimpse: పర్ఫార్మెన్స్ బద్దలే.. పాత బస్తీ పోలీస్ గా పవన్..

Highlights

Ustaad Bhagat Singh Glimpse: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ ట్రీట్ ఇచ్చేశాడు.

Ustaad Bhagat Singh Glimpse: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ ట్రీట్ ఇచ్చేశాడు. గబ్బర్ సింగ్ రిలీజై 11 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ పవన్ తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను హరీష్ సర్ ప్రైజ్ చేశాడు. ఈ ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ పాతబస్తీ పోలీస్ అధికారిగా కనిపించారు. లుంగీ కట్టిన పవన్ కల్యాణ్..ఈసారి ఫర్ ఫార్మెన్స్ బద్దలైపోతుందని చెప్పిన డైలాగ్ గ్లిమ్స్ కే హైలైట్ గా ఉంది.

ప్రతి యుగంలో అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరిస్తాడని భగవద్గీత శ్లోకంతో గ్లింప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ అని పవన్ చెప్పే మాట, వాకింగ్ స్టైల్, కళ్లజోడు పెట్టుకొని చేతులు ఊపడం...అన్ని కెవ్వుకేక పెట్టించే రేంజ్ లో ఉన్నాయి.

గబర్ సింగ్ పదేళ్ల అభిమానుల ఆకలి తీర్చితే..ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తన పదకొండేళ్ల ఆకలి అని గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పి..ఫ్యాన్స్ లో సినిమా పై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లాడు. మొత్తానికి గ్లిమ్స్ చూస్తుంటే మరోసారి పవన్_హరీష్ కాంబో బాక్సాఫీసులను బద్దలు కొట్టడం ఖాయంగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories