Salaar: ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ సలార్‌ టీజర్‌ విడుదల.. సెప్టెంబర్‌ 28న విడుదల కానున్న సలార్‌ పార్ట్‌-1

Pan India Star Prabhas Movie Salaar Teaser Released
x

Salaar: ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ సలార్‌ టీజర్‌ విడుదల.. సెప్టెంబర్‌ 28న విడుదల కానున్న సలార్‌ పార్ట్‌-1

Highlights

Salaar: KGF రికార్డులను ప్రభాస్ ‘సలార్’ తిరగ రాయడం గ్యారంటీ అనిపిస్తుంది..

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. మూవీ గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను మ‌రింత‌గా పెంచారు. అంద‌రూ ఊహించిన‌ట్లే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న యూనివ‌ర్స్ నుంచి థ్రిల్లింగ్ యాక్ష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజ‌ర్‌ను చూస్తుంటే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంద‌నిపిస్తుంది. KGF రికార్డులను ప్రభాస్ ‘సలార్’ తిరగ రాయడం గ్యారంటీ అనిపిస్తుంది..

టీజర్ గమనిస్తే.. ఓ ముసలి వ్యక్తి కారుపై కూర్చుని ఉంటాడు. అతని చుట్టూ అందరూ గన్స్‌తో నిలబడి ఉంటారు. అందరూ అరస్తుంటే.. అతను అరవకండి అని అంటాడు. ఓ వ్యక్తిని గన్ తీసుకుని ఆయన దగ్గరకు వచ్చి గురి పెట్టగా, ఆయన మాట్లాడుతూ అడవిలో సింహం, చిరుత, ఏనుగు, పులి అని చాలా భయంకరమైనవే. కానీ.. జురాసిక్ పార్క్‌లో కాదు.. అని అనగానే అతను భయపడి దూరంగా జరుగుతాడు.

ఆ వెంటనే లాంగ్ షాట్‌లో ప్రభాస్ కత్తులతో విలన్స్‌ని తెగ నరికే సీన్‌ను చూపించారు. దగ్గరగా వస్తే ప్రభాస్ పిడికిలి రక్తంతో తడిసిపోయి ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అనే పేరుతో పాటు సలార్ టైటిల్ పడుతుంది. ఈ యాక్షన్ సీన్ చూస్తుంటేనే గూజ్ బమ్స్ వచ్చేస్తున్నాయి

బిగ్గెస్ట్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సృష్టించిన ప్ర‌త్యేక‌మైక‌మైన ప్ర‌పంచం KGF. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను రూపొందించిన నీల్ దానికి కొన‌సాగింపుగా ఎన్నో సీక్వెల్స్‌ను రూపొందించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. భారీ బ‌డ్జెట్‌, భారీ తారాగ‌ణంతో రూపొందిన స‌లార్ మూవీ టీజ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌ళ్లు చెదిరే టీజర్‌ను అందించింది. స‌లార్ యూనివ‌ర్స్‌లోని పార్ట్ 1కు సంబంధించిన టీజ‌ర్ మాత్ర‌మే ఇది. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలుంటాయ‌నేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories