Prabhas: గురువుకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. అదేంటో తెలుసా?

On the Occasion of Satyanand’s Birthday Prabhas Gave a Luxurious Gold Watch as a Gift
x

Prabhas: గురువుకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. అదేంటో తెలుసా?

Highlights

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే టాలీవుడ్‌లోనే కాదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే టాలీవుడ్‌లోనే కాదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన ప్రభాస్.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్ అనే సినిమా ఫ్యాన్స్‌ను ఫిదా చేయడంతో.. డార్లింగ్ అంటూ ముద్దుగా పిలస్తూ, పిలిపించుకుంటున్నాడు ఈ టాలీవుడ్ హీరో.

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. ప్రభాస్ పెద్ద హీరో అయినప్పటికీ చాలా మర్యాదగా నడుచుకుంటూ.. ప్రతీ ఒక్కరిని గౌరవిస్తుంటాడు.

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో పాతది. అయితే, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రభాస్ తన గురువు సత్యానంద్‌కు ఖరీదైన బహుమతిని ఇస్తున్నట్లు చూడొచ్చు.

సత్యానంద్ ఎవరు?

సత్యానంద్‌ ప్రభాస్‌కు నటనలో శిక్షణ ఇచ్చాడు. కేవలం ప్రభాస్ కోసమే కాదు. సత్యానంద్ చాలా మంది మన టాలీవుడ్ స్టార్ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చాడు. సత్యానంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ బంగారు వాచీని బహుమతిగా ఇచ్చాడు. అత్యంత ఖరీదైన బహుమతిని ఇవ్వడంతో పాటు అతనితో సరదాగా మాట్లాడి నవ్వించాడు ప్రభాస్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాస్ రాబోయే సినిమాలు..

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కిర్గందూర్ నిర్మించారు. అలాగే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్‌తో కలిసి సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కూడా నటిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories