Niharika Konidela: చెల్లెలి సినిమాకు అన్నా, వదినల సందడి.. వైరలవుతోన్న నిహారిక కొత్త సినిమా ఫొటోలు..!

Niharika Konidela 1st Movie Started By Varun Tej And Lavanya Tripathi See Viral Photos
x

Niharika Konidela: చెల్లెలి సినిమాకు అన్నా, వదినల సందడి.. వైరలవుతోన్న నిహారిక కొత్త సినిమా ఫొటోలు..!

Highlights

Niharika Konidela: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Niharika Konidela: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా, ఈసారి నటిగా మాత్రం కాదండోయ్. నిర్మాతగా కనిపించనుంది. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు.

నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి యదు వంశీ డైరెక్షన్ చేయనున్నారు. అయితే, తొలి సన్నివేశానికి మెగా డాటర్ నిహారిక అన్న హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నిహారిక తండ్రి నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల ముహూర్తపు సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని అందించారు.

ఈ మేరకు నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. ఇప్పుడు ఓ సినిమా తీయాని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాను శ్రీరాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా టెన్షన్‌గానూ ఉంది. యాదు వంశీ డెరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీయనున్నాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ సినిమాలో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ నటించనున్నారు. షూటింగ్ త్వరలో మొదలుకానుంది' అని తెలిపారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవంలో నూతన దంపతులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీలు కూడా సందడి చేశారు. కాగా, ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories