Kushi Movie Review: ''ఖుషి'' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Kushi Telugu Movie Review
x

Kushi Movie Review: ''ఖుషి'' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Highlights

Kushi Movie Review: ఇక విజయ్ సమంత కలిసి చేసిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

Kushi Movie Review: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్ లో చేసిన మూవీ ఖుషి .. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది... ఈ సినిమాలో సమంతతో కలిసి థియేటర్ లో సందడి చేస్తున్న విజయ్ ఖుషి మూవీ తో హిట్ కొట్టాడా లేదా అనేది తెలుసుకుందాం..

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు.

నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్

సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్

సినిమాటోగ్రఫీ: మురళి.జి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఇక ఖుషి మూవీ కథ విషయానికి వస్తే విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) ఆరాధ్య (సమంత)ను చూసి మొదట్లోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అతన్ని దూరం పెట్టడానికి ఆరాధ్య ఎన్ని అబద్ధాలు చెప్పి దూరం పెట్టాలనుకున్న .. ఎట్టకేలకు చివరకు విప్లవ్ తో ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే వీరి ప్రేమకు విప్లవ్, ఆరాధ్య తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడం .. ఆలా రెండు కుటుంబాలకు ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులను ఎదిరించి విప్లవ్ – ఆరాధ్య పెళ్లి చేసుకోవడం. మరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా సాగింది ? మరి వీళ్ళ మధ్య వచ్చిన చిన్న చిన్న[ ఇగో ] పొరపాట్లను సరిచేసుకున్నారా ..?, లేదా .. ? అనేది మిగిలిన కథ.

ఖుషి సినిమా గుడ్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ డ్రామా... ఇక విజయ్ దేవరకొండ సమంత ఇద్దరి నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి ... ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు విజయ్. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హోమం సీక్వెన్స్ లో అలాగే సమంత వెళ్ళిపోయాక వచ్చే సీన్స్ లో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే విజయ్ కి – సమంతకి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉందంటున్నారు.. అలానే చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ, నాస్తికుడు సత్యంగా సచిన్ ఖేడేకర్ తమ పాత్రలతో అకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన రోహిణి, లక్ష్మి కూడా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న కథ బాగున్నప్పటికీ, కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్ అలాగే సెకెండ్ హాఫ్ లో అక్కడక్కడ స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. అలానే కొన్ని సీన్లు తన పాత సినిమాలో చూసిన ఫీల్ కలుగుతుంది. అలానే హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ సినిమాకే ప్లస్ అంటున్నారు, ఇక ఎడిటింగ్ , సినిమాటోగ్రఫీ అన్ని పర్లేదనిపిస్తున్నాయి

ఓవర్ అల్ గా ఖుషి మూవీ ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ డ్రమ్ అంటున్నారు. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. ఇక విజయ్ సమంత కలిసి చేసిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories