Jr NTR: రెండు సినిమాలతో యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ

Jr NTR Bollywood Entry With Two Movies
x

Jr NTR: రెండు సినిమాలతో యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ

Highlights

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ సినిమా దీపావళికి రిలీజ్ కాబోతోంది.

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ సినిమా దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఇంతవరకు తారక్ ఒక్క బాలీవుడ్ మూవీ కూడా చేయలేదు. కాని టపాసుల పండక్కి బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంట్రీనే కాదు, బాక్సాఫీస్ మీద దాడి కూడా కన్ఫామ్ అయ్యింది. అదెలా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5న రానుంది. ఆతర్వాతే వార్ 2 మూవీతో తను హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. త్రిబుల్ ఆర్ తో పాన్ఇండియా లెవల్లో ఫోకస్ అయిన తారక్ డైరెక్టర్ హిందీ మూవీ దీపావలికే రిలీజ్ అంటే అంతా షాక్ అవ్వక తప్పట్లేదు.

హ్రితిక్ రోషన్ తో, తారక్ కలిసి చేయబోతున్న మూవీ వార్ 2. ఇది టైగర్ ష్రాఫ్ , హ్రితిక్ కాంబోలో వచ్చిన వార్ కి సీక్వెల్.. ఇదింకా పట్టాలెక్కలేదు. రీసెంట్ గా తారక్ కి కథ వినిపించిన అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ లో పట్టాలెక్కించబోతున్నాడు. సో మరెలా తారక్ ఈ దీపావళికే బాలీవుడ్ లో సందడి చేస్తాడు..? ఆప్రశ్నకే ఆన్సర్ దొరికింది.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ టైగర్ 3 లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తున్నాడట. క్లైమాక్స్ ని రీషూట్ చేస్తున్న టీం తారక్ ని కలిసి తన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుందని తెలుస్తోంది. పఠాన్ లో షారుఖ్ కోసం సల్మాన్ గెస్ట్ రోల్ వేస్తే, టైగర్3 కోసం షారుక్ కూడా గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. విచిత్రం ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ కూడా కన్ఫామ్ అని తెలుస్తోంది.

బేసిగ్గా ఎన్టీఆర్ ఫేవరెట్ హిందీ హీరో సల్మాన్ ఖాన్. ఆ అభిమానంతో తను కాల్ చేయగానే తారక్ ఒప్పేసుకున్నాడట. అలా టైగర్ 3 లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తే, ఇదే తన తొలి హిందీ మూవీగా మారే ఛాన్స్ ఉంది.

టైగర్ 3లో ఎన్టీఆర్ గెస్ట్ గా కనిపిస్తే అది తన తొలి హిందీ మూవీ అవుతుంది. అలానే వార్ 2 మాత్రం పూర్తి స్థాయి హీరోగా చేసిన అసలైన బాలీవుడ్ ఎంట్రీ గా ఫోకస్ కాబోతోంది. ఏదేమైనా దీపావళికి సల్మాన్ తోపాటు తారక్ సందడి నార్త్ లోభారీగా నే పెరగబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories