Dhanush: కోలార్ గనులపై కన్నేసిన ధనుష్..

Dhanush, Vetrimaarans Next Movie in KGF Backdrop
x

Dhanush: కోలార్ ఘనులపై కన్నేసిన ధనుష్..

Highlights

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరు, సార్ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. సార్ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ గా రిలీజ్ చేసి ఇక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పిరియాడిక్ థ్రిల్లర్ గా కెప్టెన్ మిల్లర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, నివేదితా సతీష్ తో పాటు RRR ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్ నటిస్తున్నారు.

పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీని ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మూవీ తర్వాత ధనుష్ మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమాకి రెడీ అయ్యాడు. పొల్లదావన్, ఆడుకాలం, వడాచెన్నై, అసురన్ చిత్రాలతో తనకు హిట్లు ఇచ్చిన వెట్రిమారన్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ధనుష్ రెడీ ఔతున్నాడు. అయితే ముందుగా ప్రచారం జరిగినట్లు ఇది వాడాచెన్నైకు స్వీకెల్ కాదని పూర్తిగా సరికొత్త కథతో వస్తున్నాడని తెలుస్తోంది.

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ చేసే ఈ కొత్త చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. అంతేకాదు, వెట్రిమారన్ గత చిత్రాల మాదిరే ఇది కూడా రా అండ్ రస్టిక్ గా ఉంటుందట. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంగా సినిమా ఉన్నా..ఇప్పటివరకు వచ్చిన చిత్రాలను పూర్తి భిన్నంగా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రకటించాడు. ఈ నిర్మాత ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కేజీఎఫ్, తంగలాన్ చిత్రాలను మించి వెట్రిమారన్ ఏం చూపిస్తాడోనని ధనుష్ అభిమానులతో పాటు కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ధనుష్ ఫ్యాన్స్ సైతం ప్రాజెక్ట్ విశేషాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories