Vishwambhara: విశ్వంభర షూటింగ్‌లో జాయిన్ అయిన స్టార్ హీరోయిన్.. 18 ఏళ్ల తర్వాత మెరవనున్న జోడి..
Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.
Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార సినిమాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ.
తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW
— Trish (@trishtrashers) February 5, 2024
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire