Bigg Boss 7 Telugu: మొదలైన 'ఉల్టాఫల్టా' హంగామా.. ఎంట్రీ ఇచ్చిన 13మంది కంటెస్టెంట్స్.. పూర్తి వివరాలివే

Bigg Boss 7 Telugu 13 Star celebrities 3 enter into Bigg Boss Telugu Season 7, Know full details here
x

Bigg Boss 7 Telugu: మొదలైన 'ఉల్టాఫల్టా' హంగామా.. ఎంట్రీ ఇచ్చిన 13మంది కంటెస్టెంట్స్.. పూర్తి వివరాలివే

Highlights

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ తెలుగు 7వ సీజన్‌ గ్రాండ్‌గా మొదలైంది. 'ఉల్టా పుల్టా' అంటూ వీక్షకుల్లో ఊపు పెంచిన టీజర్‌తో అంతే కిక్కిస్తూ.. గత రాత్రి స్టార్ కంటెస్టెంట్లతో సందడిగా మొదలైంది. అలా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో లేదో అప్పుడే గొడవలు కూడా పెట్టేశాడు నాగర్జున.

Bigg Boss 7 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ తెలుగు 7వ సీజన్‌ గ్రాండ్‌గా మొదలైంది. 'ఉల్టా పుల్టా' అంటూ వీక్షకుల్లో ఊపు పెంచిన టీజర్‌తో అంతే కిక్కిస్తూ.. గత రాత్రి స్టార్ కంటెస్టెంట్లతో సందడిగా మొదలైంది. అలా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో లేదో అప్పుడే గొడవలు కూడా పెట్టేశాడు నాగర్జున. ఇలా మొత్తానికి 7వ సీజన్‌లో ఎవరుంటారోనని ఆసక్తిగా చూసిన వారికి ఎట్టకేలకు ఫుల్ లిస్ట్ వచ్చేసంది. సినిమా వాళ్లనే కాదండోయ్.. సీరియల్స్‌లో నటించిన నటీనటులను బిగ్ బాస్ 7వ సీజన్‌ బరలోకి దించేశారు.

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్‍గా ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ కూడా సూపర్బ్‌గా అనిపించింది. బలగం సినిమాలోని 'పొట్టి పిల్ల' అనే సాంగ్‌కు చిందులు వేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

సినిమాలకు దూరమై, రాజకీయాల్లో అలావచ్చి ఇలా మాయమైన ప్రముఖ నటుడు శివాజీ ఎంట్రీతో అందరికీ బిగ్‍బాస్ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో తన తల్లిని గుర్తు చేసుకుంటూ హౌస్‌లోకి అడుగుపెట్టారు శివాజీ.

ఇక మూడో కంటెస్టెంట్‌గా ప్రముఖ సింగర్ దామిని భట్ల హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈమె బాహుబలి సినిమాలోని వండర్‌ఫుల్ సాంగ్ 'పచ్చబొట్టేసి'న పాటతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు.

ఇక 4వ కంటెస్టెంట్ గా నటుడు, మోడల్ ప్రిన్స్ యావర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 5వ కంటెస్టెంట్‌గా సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తోన్న లాయర్‌ శుభశ్రీ అడుగుపెట్టింది.

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌లో 6వ కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి షకీలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన లైఫ్‌లో చేదు అనుభవాలను పంచుకుని ఎమోషనల్‌ అయ్యారు. అలాగే 7వ కంటెస్టెంట్‌గా ఆట సందీప్ అదిరిపోయే స్టెప్పులతో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

8వ కంటెస్టెంట్‌గా శోభాశెట్టి అదేనండీ కార్తీక దీపం' మోనిత అడుగపెట్టారు. అయితే, హౌస్‌లోకి మోనితలా కాకుండా ఒరిజినల్ శోభ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చింది.

ఇక మిగతా కంటెస్టెంట్లను ఓసారి చూస్తే.. ప్రముఖ నటి రతిక, జబర్దస్త్ కమెడియన్‌ తేజ, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, అమర్‌ దీప్‌ ఇలా మొత్తం 13 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక నేటి నుంచి ఉల్టా ఫల్టా టాస్క్‌లో, అదిరిపోయే ఎంటర్టైన్‌మెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసేందుకు సిద్ధమైంది బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్.

Show Full Article
Print Article
Next Story
More Stories