Balakrishna: బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం.. 'భగవంత్ కేసరి' థియేట్రికల్ బిజినెస్ చూస్తే పరేషానే..

Balakrishna And Anil Ravipudi Combo Movie Bhagavanth Kesari Theatrical Business Rs 75 Crores Highest In His Career
x

Balakrishna: బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం.. 'భగవంత్ కేసరి' థియేట్రికల్ బిజినెస్ చూస్తే పరేషానే..

Highlights

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బంఫర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘భగవంత్ కేసరి’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బంఫర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘భగవంత్ కేసరి’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేయనుది. అలాగే శ్రీలీల ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్ కనిపించనున్నారు.

కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌కు దగ్గర పడుతుంది. అయితే, థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా పూర్తి అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల బిజినెస్ పూర్తయిందని చెబుతున్నారు. అయితే, ఈ మూవీ బాలయ్య బాబు కెరీర్‌లోనే అత్యధికంగా బిజినెస్‌ చేసిందంట. గత బాలయ్య సినిమాలతో పోల్చితే వీరసింహారెడ్డి రూ.73 కోట్లు, అఖండ రూ.54 కోట్లు, రూలర్ రూ.24 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు రూ.70 కోట్ల బిజినెస్ కంటే ఎక్కువగా జరిగిందంట.

అయితే భగవంత్ కేసరి విడుదల రోజునే తమిళ సూపర్ స్టార్ విజయ్ 'లియో' సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది బాలయ్య సినిమా నిర్మాతలే కావడం విశేషం. కాగా, ఈ మూవీని సితార రూ.23 కోట్ల ఖర్చుతో దక్కించుకుందంట. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఒకే రోజు అంటే అక్టోబర్ 19న ఢీ కొట్టునున్నాయి. వీటితోపాటు మాస్ మహారాజ రవితేజ పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానుంది.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. బాలయ్య ఈ సినిమాలో పవర్‌ఫుల్‌గా ఉంటుందంట. అదే సమయంలో బాలయ్య ప్రవర్తన, చెప్పే డైలాగులు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయని చెబుతున్నారు ఉంటాయట. ఈ మూవీలో తండ్రి కూతురు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయంట. కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 5 భాషల హక్కుల కోసంఈ మొత్తం చెల్లించినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories