Allu Arjun: పుష్ప- 3 గురించి కీలక అప్డేట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఏకంగా పుష్ప ఫ్రాంచైజ్ అంటూ..

Allu Arjun Confirms Pushpa 3
x

Allu Arjun: పుష్ప- 3 గురించి కీలక అప్డేట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఏకంగా పుష్ప ఫ్రాంచైజ్ అంటూ..

Highlights

Allu Arjun On Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే..

Allu Arjun On Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే..తెలుగులో కంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప మూవీ దుమ్ము దులిపేసింది. పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప 2 పనుల మీద బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

పుష్ప 2 సినిమా ఆగస్టు 15 రాబోతుందని ఆల్రెడీ ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 3 సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇండియన్ సినిమా తరపున బన్నీ వెళ్ళాడు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సినిమాని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 3 కూడా ఉండొచ్చు. మేము పుష్పని ఒక ఫ్రాంచైజ్ లా తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాం అని తెలిపాడు.

రెండో భాగం విడుదలయ్యాక పార్ట్‌- 3 గురించి ప్రకటన రావచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఇప్పటకే త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్లతో సినిమాను ఒప్పుకున్నారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారని టాక్‌ ఉంది. ఇలాంటి సమయంలో పుష్ప-3 రావడం అంత సులభం కాదని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories