30 Years Prudhvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి అస్వస్థత... హాస్పిటల్ బెడ్ పైనే..

30 Years Industry Pruthviraj Hospitalized
x

30 Years Prudhvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి అస్వస్థత... హాస్పిటల్ బెడ్ పైనే..

Highlights

30 years Prudhvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ డైలాగ్ వినగానే మనకు కమెడియన్ పృథ్వి ఠక్కున గుర్తుకొచ్చేస్తాడు.

30 years Prudhvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ డైలాగ్ వినగానే మనకు కమెడియన్ పృథ్వి ఠక్కున గుర్తుకొచ్చేస్తాడు. ఈ డైలాగ్ తో పృథ్వి టాలీవుడ్ లో ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే..తనదైన విలక్షణ డైలాగ్ డెలివరీతో అందర్నీ కడుపుబ్బా నవ్వించే పృథ్వి సడెన్ గా హాస్పటల్ బెడ్ పై కనిపించి షాక్ ఇచ్చాడు. పృథ్విరాజ్ అనారోగ్యానిక కారణం ఏంటో తెలియదు కానీ తాజాగా ఒక వీడియోని పృథ్వీ స్వయంగా రిలీజ్ చేశాడు.

ఈ వీడియోలో పృథ్వీ హాస్పటల్ బెడ్ పై ఉండి సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు ఉంది. సెలైన్ ఎక్కించుకుంటూనే పృథ్వీ తన డైరెక్షన్ లో తొలిసారిగా వస్తున్న సినిమా గురించి మాట్లాడాడు. పృథ్వీ తన కూతురు శ్రీలును హీరోయిన్ గా పెట్టి కొత్త రంగుల ప్రపంచం టైటిల్ తో సినిమాను చేశారు. ఈ సినిమా గురించి చెబుతూ..ఈ నెల 26న ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నామని...దీనికి మీ ఆశీస్సులు కావాలంటూ పృథ్వీ ప్రేక్షకులను కోరాడు. అంతేకాదు సెలైన్ ఎక్కించుకుంటున్నా సినిమా గురించే ఆలోచిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో చూసిన పలువురు పృథ్వీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అయితే వర్క్ బర్డెన్ తో స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సమంత మాదిరే తన సినిమా ప్రమోషన్స్ కోసం పృథ్వీ ఇలా బెడ్ ఎక్కాడేమో అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఇందులో నిజమెంతో తెలియదు..పృథ్వీ ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తూనే రాజకీయాల్లో కూడా వర్క్ చేస్తున్నాడు. గతంలో వైసీపీలో ఉన్న ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం...ప్రస్తుతం జనసేనలో చేరాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories