Upcoming Movies: మూవీ లవర్స్‌కు మూవీ ఫెస్టివల్.. దసరా బరిలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్.. ఓటీటీలో ఎన్నంటే?

10 Upcoming Movies Released In Telugu Check October 2nd Week OTT Releases
x

Upcoming Movies: మూవీ లవర్స్‌కు మూవీ ఫెస్టివల్.. దసరా బరిలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్.. ఓటీటీలో ఎన్నంటే?

Highlights

Upcoming Movies in Telugu: రానున్న దసరా ఫెస్టివల్‌కు ఎన్నో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులో అగ్ర హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి.

Upcoming Movies in Telugu: రానున్న దసరా ఫెస్టివల్‌కు ఎన్నో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులో అగ్ర హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇందులో ఇదివరకు విడుదల కానీ సినిమాలు కూడా ఉన్నాయి. డబ్బింగ్‌ సినిమాలతో కలిపి ఏకంగా 10 చిత్రాలు విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రియాపాల్‌, పులివెందుల మహేష్‌ జోడీగా శివరామ్‌ తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘మా ఊరి సిన్మా’ (maa oori cinema) సినిమా అక్టోబరు 12న విడుదల కానుంది. జి.మంజునాథ్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో మహేష్‌ విట్టా, ముఖేష్‌ కీలక పాత్రలు పోషించారు.

జయం రవి, నయనతార కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అహ్మద్‌ దర్శకుడిగా పనిచేశాడు. తమిళ సినిమా ‘ఇరైవన్‌’కు డబ్బింగ్ ఈ సినిమా. సుధన్‌ సుందరం, జి.జయరామ్‌ ఈ మూవీని చిత్రీకరించాడు. తెలుగులో ‘గాడ్‌’ (GOD Movie)గా రిలీజవుతోంది. అక్టోబరు 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నిర్మించిన సినిమా ‘వెయ్‌ దరువెయ్‌’ (veyi daruveyyi) సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది. దేవరాజు పొత్తూరు నిర్మించిన ఈ సినిమాలో యాశ శివకుమార్‌ హీరోయిన్‌గా నటించింది. సునీల్‌ కీ రోల్ పోషించారు.

శివ కంఠమనేని హీరోగా నటించిన ‘మధురపూడి గ్రామం అనే నేను’ (madhurapudi gramam ane nenu) అక్టోబరు 13న విడుదల కానుంది. క్యాథలిన్‌ గౌడ హీరోయిన్. మల్లి డైరెక్షన్ చేశారు.

‘సగిలేటి కథ’ (sagileti katha) అక్టోబరు 13న థియేటర్స్‌లో విడుదల కానుంది.

అభయ్‌ నవీన్‌, కుశాలిని కీ రోల్ పోషించిన సినిమా ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam) అక్టోబరు 13న విడుదల కానుంది.

వికాష్‌ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నీతోనే నేను’ (Neethone Nenu) అక్టోబరు 13న విడుదల కానుంది. . అంజిరామ్‌ తెరకెక్కించగా.. ఎమ్‌.సుధాకర్‌ రెడ్డి నిర్మించారు.

ఇదివరకే విడుదలై విజయం అందుకున్న ‘రతినిర్వేదం’ (Rathinirvedam) సినిమా మరోసారి విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 13న రీరిలీజ్‌కు సిద్ధమైంది. శ్వేతమేనన్‌, శ్రీజిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను శోభారాణి నిర్మించారు. టి.కె.రాజీవ్‌కుమార్‌ డైరెక్షన్ చేయగా, ఎం.జయచంద్రన్‌ మ్యూజిక్ అందించారు.

శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జోడీగా నటించిన ‘తంతిరం’(Tantiram) సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ముత్యాల మెహర్‌ దీపక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను శ్రీకాంత్‌ కండ్రేగుల నిర్మించారు.

ఈ సినిమాలతో పాటు ‘యూనివర్సిటీ’, ‘పెళ్లెప్పుడు’, ‘ధక్‌ ధక్‌’, ‘భగవాన్‌ భరోసా’ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

శాన్వీ మేఘన, సంగీత్‌ శోభన్‌ జోడీగా ‘ప్రేమ విమానం’ (prema vimanam) అనే సిరీస్ విడుదల కానుంది. సంతోష్‌ కట దర్శకత్వంలో తీసిని ఈ సినిమా అభిషేక్‌ నామా నిర్మించారు. ఈ సినిమాలో అనసూయ, వెన్నెల కిశోర్‌, దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా కీలక పాత్రత్లో నటించారు. జీ5లో అక్టోబర్‌ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌..

మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9

బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11

కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13

బుక్‌ మై షో..

మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) -అక్టోబరు 11

డిస్నీ+హాట్‌స్టార్‌..

మతగం (తమిళం) అక్టోబరు 12

గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13

సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ)- అక్టోబరు 13

ఆహా..

మట్టి కథ (తెలుగు)- అక్టోబరు 13

Show Full Article
Print Article
Next Story
More Stories