Mangoes Before Eating: మామిడిపండ్లు తినేముందు నీటిలో నానబెట్టండి.. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు..!

Soak mangoes in water before eating them otherwise you will be in a lot of danger
x

Mangoes Before Eating: మామిడిపండ్లు తినేముందు నీటిలో నానబెట్టండి.. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు..!

Highlights

Mangoes Before Eating: వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లోకి మామిడి పండ్లు వస్తాయి. ఇక మామిడి ప్రియులను ఆపడం మనతరం కాదు.

Mangoes Before Eating: వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లోకి మామిడి పండ్లు వస్తాయి. ఇక మామిడి ప్రియులను ఆపడం మనతరం కాదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ మామిడి పండ్లను ఇష్టపడుతారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. బంగినపల్లి, రసాలు, తోతాపురి అంటూ ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అయితే మామిడి పండ్లను తినేముందు కచ్చితంగా వాటిని నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నీటిలో మామిడిపండ్లను నానబెట్టడం వల్ల దాని నుంచి ఫైటిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఒకవేళ దీనిని కడగకుండా తినడం వల్ల ఈ యాసిడ్ మన కడుపులోకి చేరి సమస్యలకు దారి తీస్తుంది. నిజానికి మామిడిలో ఉండే ఈ ఫైటిక్ యాసిడ్‌ను యాంటీ న్యూట్రియంట్ అంటారు. ఈ యాసిడ్ కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలను శరీరంలో కరిగిపోకుండా నిరోధిస్తుంది. దీని వల్ల శరీరంలో ఖనిజాల లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగా మామిడిని తినడానికి ముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం అవసరం. దీనివల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.

కొన్నిసార్లు పచ్చి మామిడిని పండించడానికి కార్బైడ్ ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైన పురుగుమందు. కడగకుండా తినడం వల్ల ఇది కడుపులోకి ప్రవేశించి తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది కాకుండా ఈ రసాయనం వల్ల చర్మం, కళ్ళు, ఛాతిలో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే మామిడి పండును తినే ముందు కాసేపు నీటిలో నానబెట్టాలి. అలాగే మామిడిపండు ప్రకృతిలో చాలా వేడిగా ఉంటుంది. నీటిలో నానబెట్టకుండా తింటే కడుపునొప్పి, వాంతులు, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories