Eating Watermelon: ఎండాకాలం పుచ్చకాయ తింటున్నారా.. ఈ విషయాల గురించి తెలుసుకోండి..!

Are you eating watermelon during summer know about its benefits
x

Eating Watermelon: ఎండాకాలం పుచ్చకాయ తింటున్నారా.. ఈ విషయాల గురించి తెలుసుకోండి..!

Highlights

Eating Watermelon: ఎండాకాలం తినే పండ్ల పేరు చెప్పుమని అడిగితే అందరికి మొదటగా గుర్తుకువచ్చేది పుచ్చకాయ మాత్రమే.

Eating Watermelon: ఎండాకాలం తినే పండ్ల పేరు చెప్పుమని అడిగితే అందరికి మొదటగా గుర్తుకువచ్చేది పుచ్చకాయ మాత్రమే. ఇది తక్కువ ధరలో మార్కెట్​లో లభిస్తుంది. దీనిని అందరూ కొనుగోలు చేయవచ్చు. పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలం తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. డీ హైడ్రేషన్​ లాంటి సమస్యలను నివారించవచ్చు. శరీరంలో వాటర్‌ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్‌, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్‌, విటమిన్‌-ఏ, విటమిన్‌ -బీ6, విటమిన్‌-సి ఉంటాయి. ఇవన్ని చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. గర్భిణీలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెలో కలిపి పుచ్చకాయ తింటే ఎంతో మంచిది. డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంధి. బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలో ఉంది. నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దీనివల్ల మనసుకు, శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. పుచ్చకాయ ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది. మహిళలు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే మూలకాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడుతాయి. పుచ్చకాయ పండ్లు గుండెలోని ధమనులు మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతాయి. విటమిన్ సి శరీరానికి అవసరమైన పోషకం. ముఖం అందంగా, చర్మం మెరిసిపోవడానికి పుచ్చకాయ ఎంతగానో సహకరిస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ జుట్టు, చర్మానికి చాలా మంచిది. చర్మంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అలెర్జీని నివారించడానికి పుచ్చకాయను ప్రతిరోజూ తినవచ్చు. ఆస్తమా బాధితులు పుచ్చకాయ పండును తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి ఆస్తమా లోపాన్ని సరిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories