Lemon Water Side Effects: లెమన్ వాటర్‌ ఎక్కువగా తాగుతున్నారా.. ఎవరికి హాని జరుగుతుందో తెలుసుకోండి..!

Are You Drinking Too Much Lemon Water Know Who Is Harmed
x

Lemon Water Side Effects: లెమన్ వాటర్‌ ఎక్కువగా తాగుతున్నారా.. ఎవరికి హాని జరుగుతుందో తెలుసుకోండి..!

Highlights

Lemon Water Side Effects: ఎండాకాలంలో దాహం విపరీతంగా వేస్తుంది కాబట్టి చాలామంది చల్లటి పానీయాలను తాగుతుంటారు.

Lemon Water Side Effects: ఎండాకాలంలో దాహం విపరీతంగా వేస్తుంది కాబట్టి చాలామంది చల్లటి పానీయాలను తాగుతుంటారు. అయితే అందరికి అందుబాటులో ఉండేది లెమన్‌ వాటర్‌ మాత్రమే. ఈ నీటిని తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య దూరమవుతుంది వేడిని నివారించడమే కాకుండా బరువును తగ్గిస్తుంది. వాస్తవానికి నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ కొంతమందికి ఇది సమస్యలను కలిగిస్తుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. వారి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వయసు పైబడకుండా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ప్రజలు నిమ్మరసంపైనే ఆధారపడు తారు. విటమిన్ సి, జింక్, ఫోలిక్ యాసిడ్ నిమ్మకాయలో ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అయితే రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల దంతాల మీద దుష్ప్రభావాలుం టాయి. నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల దంతాల్లో సెన్సిటివి టి సమస్య ఏర్పడుతుంది. నిమ్మరసం నీరు పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇప్పటికే గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మానుకోవాలి. ఇందులో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున ఎసిడిటీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఎసిడిటీ సమస్య ఉన్నవారు పరగడుపున నిమ్మరసం తాగకూడదు. ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్య వచ్చినా పరగడుపున నిమ్మరసం తాగడం మానుకోవాలి. దీని కారణంగా మూత్రపిండాల పై అదనపు ఒత్తిడి పడుతుంది. అందువల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు పరగ డుపున నిమ్మరసం తాగకూడదని గుర్తుంచుకోండి. అంతే కాకుండా లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇందులో టైరమైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల రక్తం మన మెదడుకు వేగంగా చేరి మైగ్రేన్‌కు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories