Canada: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్‌ వీసా డిపాజిట్ రెట్టింపు

Revised Requirements to Better Protect International Students
x

Canada: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్‌ వీసా డిపాజిట్ రెట్టింపు

Highlights

Canada: జనవరి 1 నుంచి డిపాజిట్‌ను డబుల్ చేస్తూ నిర్ణయం

Canada: స్టూడెంట్‌ వీసాపై తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు... డిపాజిట్‌ చేయాల్సిన సొమ్మును జనవరి 1 నుంచి రెట్టింపు కన్నా ఎక్కువ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారత్‌ సహా పలు దేశాల నుంచి వచ్చే విద్యార్థులపై ప్రభావం పడనుంది. కెనడాలోని విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వచ్చేవారు ప్రయాణ, బోధన రుసుములకు తోడు.. జీవన వ్యయాల కోసం నిర్దిష్ట మొత్తంలో సొమ్ము తమ వద్ద ఉందని చూపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అది 10వేల డాలర్లుగా ఉంది. వచ్చే నెల 1 నుంచి దీన్ని 20 వేల 635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ప్రకటించారు. ఆ రోజు నుంచి స్టడీ పర్మిట్‌ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇది వర్తిస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories