Canada: కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!

Good News For Indians Living In Canada
x

Canada: కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!

Highlights

Canada: జనాభా పెరిగితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామన్న యోచనలో ట్రూడో

Canada: 2024 ఆగస్ట్‌ నెల సమయానికి కెనడా ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్‌ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది.

ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించేందుకు కెనడా నడుం బిగించింది. నిబంధనలు పాటిస్తున్నా.. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేలా వారందరికి పౌరసత్వం ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.

2025 నాటికి 5 లక్షల మందికి వలసదారులకు తమ దేశానికి ఆహ్వానిస్తామని కెనడా ప్రభుత్వం తెలిపింది. జనాబా పెరిగే కొద్ది దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడుతుందనే అభిప్రాయాన్ని కెనడా వ్యక్తం చేస్తోంది. పలు నివేదికల ప్రకారం.. కెనడాలో సరైన పత్రాలు లేకుండా 3 లక్షల నుంచి 6 లక్షల మంది జీవిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఆ డాక్యుమెంట్లు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వారు సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే కెనడా త్వరలో అమలు చేయనున్న వీసా నిబంధనలతో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులకు, తాత్కాలికంగా నివసిస్తూ వీసా గడువు ముగియనున్న వర్కర్లకు, విద్యార్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది. కానీ, ఇటీవల దేశంలోకి ప్రవేశించిన వారికి ఈ కార్యక్రమం అందుబాటులో ఉండదని మంత్రి మిల్లర్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు సిటిజన్‌ షిప్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందేలా రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇళ్ల అద్దెలు భారీగా పెరగడం, పెరిగిన ద్రవ్యోల్బణ రేట్ల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత వలస లక్ష్యాలను రాబోయే రెండు సంవత్సరాలకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023 లో 4లక్షలా 65వేల కొత్త నివాసితులు, 2024 లో 4లక్షలా 85వేలు, 2025 లో 5లక్షల మందిని ఆహ్వానించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories