Congress party

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌

Submitted by chandram on Sun, 12/16/2018 - 16:49

నేటి వరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠతకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. గత ఐదురోజులుగా సుదీర్ఘమంతానాల తరువాత మొత్తానికి కొత్త ముఖ్యమంత్రిగా భూపేష్ బాఘెల్ పేరును అధిష్ఠానం ఖరార్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సభాపక్ష బైఠక్ లో భూపేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీవ్ర కసరత్తు అనంతరం బుపేశ్ పేరును కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ సోమవారం కొత్తముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్‌ 1986లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఇవాళ కారు జోరు ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చు: పొన్నం

Submitted by chandram on Sat, 12/15/2018 - 14:12


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎప్పడైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దిగులు చెందోద్దని ప్రభాకర్ అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరు ఉండొచ్చని రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ తోకపార్టీ అని మండిపడ్డారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు.  

'పప్పూ' కాదు నిప్పు అంటున్న రాహుల్‌

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:24

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు. పరాజయాల పాదమని స్టాంపేశారు. ఇప్పుడు అవేనోళ్లు మూతపడుతున్నాయి. వెక్కిరించిన నొసళ్లే సైలెంటవుతున్నాయి. గుజరాత్‌‌లో మోడీని వణికించి, కర్ణాటకలో అపర చాణక్యం ప్రదర్శించి, కాషాయ కంచుకోట్లాంటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసి, తూటాల్లాటి మాటలు దూస్తూ, మిత్రో అబ్‌ కౌన్ హై పప్పు అంటున్నాడు.

పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి 

Submitted by chandram on Mon, 12/10/2018 - 23:20

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపణలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. టీఆర్‌ఎస్‌ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డే తనకు ఫోన్‌ చేశారన్నారు. మర్రి జనార్ధన్‌ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమ్ముడుపోయే గుణము మర్రిజనార్ధన్ రెడ్డిదని ప్రశ్నించారు. జనార్ధన ఖచ్చితంగా ఓడిపోతననే భయంతోనే నాపై ఆరోపణలు చేస్తూన్నరని ఎద్దేవా చేశారు. తనకు సుమారు 50 మంది టీఆర్‌ఎస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాబును నమ్ముకుని ఏపీ రైతులు రోడ్డునపడ్డారు

Submitted by arun on Thu, 11/29/2018 - 11:44

అది ప్రజాకూటమి కాదు.. దగా కూటమి అని మండిపడ్డారు టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 2004,2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అలాగే, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్న చంద్రబాబు కనీసం వడ్డీలు కూడా కట్టలేదన్నారు. బాబును నమ్ముకుని రైతులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ల మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారని హరీశ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీ ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 

ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే

Submitted by arun on Wed, 11/28/2018 - 11:41

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు నియోజకవర్గ కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ సీతక్కను భారీ మెజారటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కేసీఆర్ ములుగు నియోజక వర్గంలో చందులాల్ తన కుమారుడు ప్రహ్లాద్ అవినీతి పరిపాలన కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికుటుంబాలకు టీఆర్ఎస్ ఏమేరకు న్యాయం చేసిందని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఉద్యోగం పీకేస్తే...వంద రోజుల్లోగా లక్ష ఉద్యోగాలిస్తాం

Submitted by arun on Mon, 11/26/2018 - 10:54

కేసీఆర్‌ ఉద్యోగం పీకేస్తే.. వంద రోజుల్లోగా తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని రేవంత్‌‌ రెడ్డి అన్నారు. ఆసిఫాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి అర్హులైన పది లక్షల మంది నిరుద్యోగులకు నెలకు మూడు వేల భృతి ఇస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ అమలు చేస్తామన్నారు. అర్హులైనవారికి ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

గద్దర్ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:43

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెబుతున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదని అర్థమౌతుంది. కాగా గద్దర్ తనయుడు సూర్యం బెల్లంపల్లి నుండి శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసినా కాంగ్రెస్ మాత్రం మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించింది. కాగా ఇటు గద్దర్ కు,కుమారుడికి అన్యాయం జరిగిందనే భావనలో గద్దర్ ఉన్నట్లు విశ్లేశకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ తో గద్దర్ మంతనాలు జరిపిన ఫలితం దక్కలేదు.

మిగిలినవి.. మూడే...కూటమి పొత్తులో ...

Submitted by arun on Tue, 11/20/2018 - 10:48

కూటమి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తు పేరుతో సీట్లు పంచుకునేందుకు సిద్ధమైనా సర్దుబాట్ల పేర్లతో చర్చల మీద చర్చలు జరిపారు. చివరకు ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ పేరుతో మిత్రులకు కేటాయించిన సీట్లలోనే కయ్యానికి కాలుదువ్వారు. ముందు అనుకున్న పొత్తుల ప్రకారం కాంగ్రెస్‌ 94, టీడీపీ 14, టీజేఎస్‌ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీకి సిద్ధపడ్డాయి. అయితే చివరి నిముషంలో సీన్‌ కంప్లీట్‌గా రివర్స్‌ అయ్యింది. జనసమితిని అడ్డంగా బుక్‌ చేసింది కాంగ్రెస్‌. కేటాయించిన 8 స్థానాల్లో ఐదింట్లో పోటీకి నామినేషన్ వేసింది. దీంతో జనసమితి పోటీ చేసేది కేవలం 3 స్థానాల్లోనే.