tdp

కూటమి గెలిస్తే ఆ ఇద్దరి నేతలకు మంత్రి పదవులు

Submitted by chandram on Mon, 12/10/2018 - 13:20

మొన్నటి వరకు ప్రచారజోరులో ఉండి ఇక తాజాగా పోలింగ్ ముగిసే ఎగ్జీట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే కాగా తాజాగా జగిత్యాల జిల్లా తెరపైకి సరికొత్త చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజకూటమి గెలిస్తే జగిత్యాలకు డబుల్ ధమాకా కలిసోస్తుందని జోరుగా అందరినోట ఇదే ప్రచారం చక్కర్లు కొడుతుంది. కూటమి అధికారంలోకి వస్తే ఇటు జీవన్ రెడ్డి. ఎల్. రమణలకు మంత్రి పదవులు వస్తాయని ఇటు కాంగ్రెస్, టీడీపి నేతలు కార్యకర్తలు జోరుగా హుషారుగా ఉన్నారు.

పవన్‌కు బుద్దా వెంకన్న సవాల్..

Submitted by chandram on Sun, 12/09/2018 - 12:23

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. ఆదివారం మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జగన్ లపై మండిపడ్డారు. వాళ్ల కంటికి చంద్రబాబు తప్ప మరేవరూ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబును తానే అధికారంలోకి తెచ్చనంటున్న జనసేన అధినేతకు పవన్ కు సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దుతుగా ఉండి గెలిపించే సత్తా ఉందా అని సవాల్ విసిరారు. ప్రజలకోసమే అనుక్షణం పాటుతుంటే పవన్ కళ్యాణ్ వోర్వలేక పోతున్నారని అన్నారు.

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే...

Submitted by arun on Sat, 12/08/2018 - 10:27

హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టీడీపీకి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖరాశారు. అయితే, టీడీపీకి రాజీనామా చేసిన ఘనీ వెంటనే వైసీపీలో చేరిపోయారు. హిందూపురం శాసనసభకు 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన అబ్దుల్ ఘనీ.. 2014లో బాలకృష్ణ కోసం సీటు వదులుకున్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పిన అబ్దుల్ ఘనీ.. నాలుగేళ్ల వరకు టీడీపీలోనే కొనసాగారు. శ్రీకాకుళంలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయన జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గందరగోళ ప‌రిస్తితుల్లో లెప్ట్ పార్టీలు..? జ‌న‌సేన‌తో కలిసి పోటీ..?

Submitted by santosh on Sat, 12/01/2018 - 19:21

ఏపిలో ఎన్నిక‌ల కోలాహలం ప్రారంభమైంది.  పాలక, ప్రతిపక్షాలు ఎవ‌రికి వారు త‌మ వ్యూహాల‌ను సిద్దం చేసుకుంటూ ఎన్నిక‌ల‌కు సిద్దమ‌వుతున్నాయి. ఈ నేప‌ద్యంలో లెప్ట్ పార్టీలు త‌మ కార్యాచ‌ర‌ణ‌పై అయోమ‌య‌ ప‌రిస్తితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని సిపిఎం, సిపిఐ పార్టీలో ఎవ‌రితో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ వైసీపితో క‌లిసి ప్రజాపోరాటాలు చేసిన క‌మ్యునిస్టు పార్టీలు తాజాగా జనసేనానితో  క‌లిసి నడుస్తున్నాయి.  వైసీపితో క‌లిసి చంద్రబాబుని ఓడిస్తామంటూ హ‌డావుడి చేసిన కమ్యూనిస్టులు  రాష్ట్రప‌తి ఎన్నిక‌ల అనంత‌రం వైసీపికి దూర‌మ‌య్యారు.

కాసేపట్లో జనసేనలోకి రావెల కిషోర్ బాబు..

Submitted by arun on Sat, 12/01/2018 - 09:31

మాజీ మంత్రి రావెలకిషోర్‌బాబు ఇవాళ పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. నాగర్జున యూనివర్శిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా గుంటూరుకు వెళ్లి అనంతరం, జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖ పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రావెల రాజీనామా  చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. 

హైదరాబాద్, చార్మినార్ కట్టానని చెప్పలేదు: చంద్రబాబు

Submitted by arun on Thu, 11/29/2018 - 15:13

హైదరాబాద్ ను తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడంపై టీడీపీ అధినేత ఈ రోజు స్పందించారు. హైదరాబాదును, చార్మినార్ ను కట్టినట్లు తాను ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తాను సైబరాబాద్ ను మాత్రమే నిర్మించాననీ, హైదరాబాద్ కు పేరు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. శేరిలింగంపల్లిలో రోడ్‌షో‌లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో ఊహించని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ అభివృద్ధి తమ కష్టార్జితమన్నారు.

మరోసారి ఎన్నికల నినాదంగా హోదా...హోదాపై పార్టీలు చెప్పేవి మళ్లీ ఉత్తుత్తి మాటలేనా?

Submitted by arun on Thu, 11/29/2018 - 11:34

తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ హోదాను ఎన్నికల అస్త్రంగా వాడేస్తోంది. ఖమ్మం సభలో విభజన హామీలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు ఇక ఏపీలో హోదా నినాదంగా టిడిపి, కాంగ్రెస్ కలసి ఎన్నికలకు వెలతాయన్న వార్తలు ఉండనే ఉన్నాయి ఏపీ ప్రజల హోదా డిమాండ్ మరోసారి ఎన్నికల అస్త్రంగానే మిగిలి పోనుందా? 

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత...టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్ కార్పొరేటర్

Submitted by arun on Wed, 11/28/2018 - 11:14

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్‌ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ తరఫున జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్, ఆయన తనయుడు రామకృష్ణ గౌడ్ తమ అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. టీడీపీ అభ్యర్థులపై దాడికి దిగడంతో టీడీపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

Submitted by arun on Mon, 11/26/2018 - 11:25

ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను కేంద్రం ఉపయోగించడం దారుణమన్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన ఆయన విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, బీజేపీకి వ్యతిరేకంగా స్థానిక పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నాడని కేంద్రం ఇలా చేయడం సరికాదన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు సీఎం రమేష్. 

టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై కేసు నమోదు

Submitted by arun on Fri, 11/23/2018 - 17:14

ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థికి కొత్త తలనొప్పి వచ్చింది. మహాకూటమి సీట్ల పంపకంలో భాగంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామ రంగారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాదాపూర్‌లో కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్టు వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. నాంపల్లి సబ్‌రిజిస్టార్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు.