In-Depth

కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీల కుమ్ములాట...సీఎం పదవిపైనే ముగ్గురు నేతల కన్ను

Submitted by arun on Sat, 06/23/2018 - 14:16

తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీల కుమ్ములాట మొదలయింది. సీఎం పదవిపై ఎవరికి వారు...ఇష్టమొచ్చినట్లు  వ్యాఖ్యలు చేస్తున్నారు. నేతల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మొదలయింది. ఎన్నికలు జరగకముందే నేతలు పదవి కోసం పొట్లాడుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయకుండా సీనియర్లు సీఎం సీటు కోసం పోటీపడటంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

రికార్డ్ సృష్టించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు

Submitted by arun on Sat, 06/23/2018 - 13:16

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు.. దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో సత్తా చాటారు. సత్తా మాత్రమే కాదు.. రికార్డ్ సృష్టించారు. 10 కాదు.. 20 కాదు.. 80 మంది విద్యార్థులు.. డైరెక్ట్‌గా ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ సంపాదించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా. ఈసారి.. తెలంగాణ పేరు మారుమోగేలా చరిత్ర సృష్టించారు మన గురుకుల స్టూడెంట్స్.

కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట...దొరికిన వారిని దొరికినట్లు లేపేస్తున్న ఇండియన్ ఆర్మీ

Submitted by arun on Sat, 06/23/2018 - 12:54

దొరికిన వాడిని దొరికినట్లు లేపేస్తున్నారు. కనిపించిన వాడిని కనిపించినట్లు మట్టుబెడుతున్నారు. భారత సైన్యానికి.. ప్రభుత్వం ఫుల్ పవర్స్, గైడెన్స్ ఇచ్చేసింది. అంతే.. మనోళ్లు వేట మొదలెట్టేశారు. కశ్మీర్‌లో కనిపించిన ఉగ్రవాదులను.. కసి తీరా ఎన్‌కౌంటర్ చేసేస్తున్నారు. టెర్రరిస్టులు కనిపిస్తే చాలు.. కాల్చిపారేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం

Submitted by arun on Sat, 06/23/2018 - 11:54

ఒకవైపు కోర్టు కేసులు మరోవైపు చట్టంలో లొసుగులతో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. బీసీ గణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోనూ లోపాలున్నాయనే వాదనలతో గడువులోపు పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్సే లేదంటున్నారు న్యాయ నిపుణులు.

దానం రాజీనామాపై ముఖేశ్‌గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 06/23/2018 - 10:52

దానంతోటే సరిపెడతారా..? లేక మరో భారీ షాక్‌ను తగిలించుకుంటారా..? ఇప్పుడీ విషయమే.. కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం పుట్టిస్తోంది. తన దారి తాను చూసుకుని తొందరపడ్డారంటూ దానంపై మరో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్.. చేసిన వ్యాఖ్యలు.. కలకలం పుట్టిస్తున్నాయి. కాస్త ఆగి ఉంటే.. అందరం కలిసి కారెక్కేవాళ్లమని.. ముఖేశ్ కుండబద్దలు కొట్టడం.. గ్రేటర్ కాంగ్రెస్‌లో అసంతృప్తి స్థాయి ఏ రేంజులో ఉందో.. చెబుతోంది. 

టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్?

Submitted by arun on Fri, 06/22/2018 - 17:11

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్‌...హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌కు పంపారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని దానంను... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. 

అమరావతిలో అరుదైన సన్నివేశం

Submitted by arun on Fri, 06/22/2018 - 17:01

వాళ్లిద్దరికీ పరిచయముంది.. దానిని మించిన బంధముంది.. అంతకుమించిన అనుబంధముంది. ఇదంతా 3 నెలల కిందటి వరకే. ఇప్పుడంతా మారిపోయింది. మనుషులు కలిసినా.. మాటల్లేవ్.. పక్కపక్కనే ఉన్నా.. పలకరింపుల్లేవ్.. మాటవరుసకైనా ఓ మాట అనుకోలేదు. నలుగురికోసమైనా నమస్తే పెట్టుకోలేదు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు...స‌ర్వే రిపోర్టుతో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావొచ్చని ప్లాన్

Submitted by arun on Fri, 06/22/2018 - 14:14

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు.. పార్టీ అధినేత కేసీఆర్ మాదిరిగానే తమ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకుంటున్నారు. చివ‌రి నిమిషంలో టికెట్ నిరాక‌రిస్తే..తమ స‌ర్వే రిపోర్టుతో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావొచ్చని ప్లాన్ వేస్తున్నారు. లేకుంటే విపక్షంలో టికెట్ దక్కించుకునేందుకు పనికివస్తుందని భావిస్తున్నారు. 

ఏపీ, తెలంగాణ మధ్య రాజకున్న కొత్త వివాదం

Submitted by arun on Fri, 06/22/2018 - 11:09

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ కలిసి రావాల్సిందేనా ? ఏపీ సర్కార్‌తో కలిసి కేసీఆర్‌ నడవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా ? హోదా ఉద్యమానికి సహకరించకపోతే...తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లంతా కేసీఆర్‌ను వ్యతిరేకిస్తారా ? టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చినంత మాత్రాన తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారా ? టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు ఏమంటున్నారు. 

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

Submitted by arun on Fri, 06/22/2018 - 10:35

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు  ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..?