Just In

ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష ప్రారంభం

Submitted by arun on Wed, 06/20/2018 - 12:41

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు సీఎం రమేష్‌ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్షా శిబిరానికి సీఎం రమేష్‌ చేరుకున్నారు.
 

ఔరంగజేబు ఇంటికి నిర్మలా సీతారామన్..

Submitted by arun on Wed, 06/20/2018 - 12:33

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్  ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని పరామర్శించారు.. ఇవాళ ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ఔరంగజేబు స్వస్థలమైన పూంఛ్ వెళ్లిన ఆమె.. అమర జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనీ... ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మలా సీతారామన్‌తో పాటు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

కొత్త నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్

Submitted by arun on Wed, 06/20/2018 - 12:22

2000 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకూ అంటారా.. మామూలుగా ఏదైనా నోటు కొద్దిగా చిరిగినా బయట చాలా మంది తీసుకోరు. తిరిగిచ్చేస్తుంటారు. కానీ, బ్యాంకులు మాత్రం వాటికి విలువ కట్టిస్తుంటుంది. అది పాత కథ. కొత్త మాటేంటంటే.. కొత్త 2000 నోటు, 200 నోటు చిరిగిందా ఇక, అంతే సంగతులు. బ్యాంకులు కూడా వాటిని తీసుకోవు. తీసుకోవట్లేదు కూడా. కనీసం సగం విలువను కూడా కట్టివ్వట్లేదు. చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు.

మిస్ ఇండియా కిరీటం అందుకున్న అనుకృతివాస్

Submitted by arun on Wed, 06/20/2018 - 11:46

తమిళనాడుకు చెందిన అనుకృతి‌వాస్ ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 29 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి, ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు.నిన్న రాత్రి ముంబై డోమ్‌లోని ‘ఎన్‌ఎస్‌సీఐ ఎస్‌వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్‌లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్‌ ఈ ఏడాది ‘మిస్‌ ఇండియా’గా ఎన్నికైంది. గతేడాది ‘మిస్‌ వరల్డ్‌’గా ఎన్నికైన మానుషి చిల్లర్‌, అనుకృతికి కిరీటం ధరింపచేసింది.

Tags

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/20/2018 - 11:02

కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్‌లోని ఆరెంజ్ ట్రావెల్స్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో చెలరేగిన మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌లోని బస్సుల గ్యారేజిలో షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులు ఏవీ లేకపోవడంతో ఆస్తి నష్టం జరుగలేదు.
 

పెళ్లి చేసుకుంటే గుండె పదిలం

Submitted by arun on Wed, 06/20/2018 - 10:58

పెళ్లంటే ఇప్పటికీ ఎంతో మంది భయపడుతుంటారు. పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. మంట అంటూ పెళ్లి చేసుకోబోయే ఫ్రెండ్స్‌ను ఆట పట్టిస్తుంటారు. తొందరపడొద్దు బ్రదర్ అంటూ సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. కానీ ఈ తాజా అధ్యయనం చూస్తే మాత్రం వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే పెళ్లి గుండెకు మంచిది అని తేల్చారు కాబట్టి. లేటు వయసులో ఓ తోడు ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని రీసెర్చర్లు తేల్చారు.

ఐపీఎస్ ఆఫీసర్ వెంట పడుతున్న ఓ యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 10:29

కేవలం సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్ల వెంటే అభిమానులు పడుతుంటారని భావిస్తుంటారా? అయితే, మీ ఆలోచన తప్పు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మూడు రోజుల క్రితం వచ్చిన పంజాబ్, హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి, తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంది. ఈ యువతి సైకాలజీలో పీజీ చేసింది. ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34)ను కలవాలని ఆ యువతి.. ఆయన కార్యాలయం ముందు పడిగాపులు కాస్తుంది.

అందమైన అమ్మాయి యువకులను కౌగిలించుకున్నవేళ...

Submitted by arun on Wed, 06/20/2018 - 10:19

రంజాన్ పర్వదినంను ముస్లిం సోదరులు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ పండుగ రోజున ముస్లింలంతా ఒకొరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ రంజాన్ పండుగ ఒక్కటే కాదు చాలా వరకు పండుగలన్నింటికీ ముస్లింలు విషెస్ చెబుతూ ఆలింగనం చేసుకుంటారు. ఇదంతా ఎక్కువగా మసీదులు, నమాజ్ చేసే స్థలాల్లో ఇలా చేస్తుంటారు.

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..

Submitted by arun on Wed, 06/20/2018 - 09:54

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే యువతిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ పై తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాపూజీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది.

చాయ్‌వాలా కూతురుకు రూ. 3.8 కోట్ల స్కాలర్‌షిప్‌

Submitted by arun on Wed, 06/20/2018 - 09:48

చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి కూతురుకు అమెరికా మస్సాచుసెట్స్‌లోని బాబ్సన్ కళాశాలలో స్కాలర్‌షిప్ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బులందషహర్‌కు చెందిన సుదీక్ష భాటి సిబిఎస్‌సి ప్లస్‌టూ పరీక్షల్లో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది ఆమెకు రూ.3.8 కోట్ల స్కాలర్‌షిప్ తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం అందించింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుకునేందుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ సుధీక్షా భాటీని వరించింది.