father kills daughter

దళితున్ని పెళ్లి చేసుకుందని కోర్టు ఆవరణలోనే..

Submitted by arun on Fri, 08/10/2018 - 16:04

పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్‌తక్‌ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. హర్యానాలోని రోహ్‌తక్‌ పట్టణంలో నివాసముండే రమేష్ దంపతులకు పిల్లలు కలగక పోవడంతో తమ బందువుల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు మమత అని పేరుపెట్టి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించింది.