Dharmapuri Arvind

సంజయ్‌పై కఠిన చర్యలకు ఆయన సోదరుడు అరవింద్ డిమాండ్

Submitted by arun on Fri, 08/10/2018 - 17:45

డీఎస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్‌ సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసుపై సోదరుడు ధర్మపురి అరవింద్ స్పందించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన డి. సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవలసిందేనని ఆయన సోదరుడు, బీజేపీ నేత అరవింద్ డిమాండ్ చేశారు. సంజయ్‌కు వ్యతిరేకంగా ఆధారాలుంటే తప్పకుండా శిక్షించాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం సంజయ్‌కి తన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదంటున్నారు అరవింద్‌. సంజయ్‌ది వేరే పార్టీ.. తనది మరో పార్టీని చెప్పుకొచ్చారు. తాను తన తండ్రి డీఎస్‌నే విభేదించి బీజేపీలోకి వెళ్లానని తెలిపారు. డీఎస్ కూడా బీజేపీలోకి వస్తారనే ప్రచారం బేస్ లెస్ అన్నారు.

ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుంది

Submitted by arun on Wed, 06/27/2018 - 14:18

నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డీఎస్‌పై కవిత చేసిన ఆరోపణలు.. ఆమె రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందని.. అన్నారు. ఆరోపణలు వింటేనే నవ్వొస్తొందని.. కుమారుడిపై కోపంతో.. తండ్రి పై చర్యలు తీసుకోవం హాస్యాస్పదం అన్నారు.  ‘టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు.