Sri Lanka

వివాదంలో మలింగా ...కలకలం రేపుతున్న చిన్మయి పోస్ట్!

Submitted by arun on Thu, 10/11/2018 - 16:32

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో  మీటూ’ ఉద్యమం భారత్ లో ఊపందుకుంది. మనవరాలి వయసులో ఉన్నప్పుడే  తనను లైంగికంగా వేధించారంటూ  ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆరోపణలు చేసింది. మొదటి నుంచి #మీటూకు మద్దతుగా ఉన్న గాయని చిన్మయి ఈ వ్యవహారానికి సంబంధించి తన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంక క్రికెటర్ లసిత్‌ మలింగాకు సంబంధించిన సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. మలింగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఈ రోజు ఆరోపించింది. సదరు ఆరోపణలను గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై భార‌త్‌ విజయం

Submitted by arun on Tue, 03/13/2018 - 08:08

ముక్కోణపు టీ20 సిరీస్‌ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు మరో తొమ్మిది బంతులు ఉండగానే ఛేదించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఉనాద్కత్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 15 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ తొమ్మిది పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ గుణతిలకను ఔట్ చేశాడు. కాసేపటికే కుశాల్‌ పెరీరాను సుందర్‌ పెవిలియన్‌‌కి పంపాడు. మూడో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌తో కలిసి 62 పరుగులు చేసిన ఉపుల్ తరంగ వెనుదిరిగాడు.

వరల్డ్ కప్‌కు శ్రీలంక అర్హత

Submitted by lakshman on Thu, 09/21/2017 - 21:15
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2019 కు శ్రీలంక అర్హత సాధిం చింది. ఓల్డ్ ట్రాఫో ర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలు కావడంతో శ్రీలంక కు ఈ అవకాశం లభించింది. దీంతో వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన...