ys jagan

సోషల్‌ మీడియా సమరానికి సై అంటోన్న వైసీపీ

Submitted by arun on Sat, 06/23/2018 - 11:04

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.... సోషల్‌ మీడియా సమరానికి సై అంటోంది. తూర్పుగోదావరిలో ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో... సోషల్ మీడియా టీమ్స్‌‌‌కి జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు వైసీపీ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాప్‌లను సిద్ధంచేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.

జగన్మోహన్‌ రెడ్డి పేరు మారింది: నారా లోకేశ్‌

Submitted by arun on Thu, 06/21/2018 - 16:31

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటిస్తోన్న లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్‌, పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భ‌యంప‌ట్టుకుంద‌ని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్‌ మోడీ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

బ్రేకింగ్ : జగన్ వ్యాఖ్యలతో పరకాల రాజీనామా

Submitted by arun on Tue, 06/19/2018 - 14:45

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రతిపక్ష నేత జగన్...అవమానించేలా మాట్లాడారంటూ...మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన లేఖలో కోరారు. నిన్న పి.గన్నవరం బహిరంగ సభలో ప్రభాకర్ పై వై.ఎస్.జగన్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పరకాల ప్రభాకర్ భార్య బీజేపీకి చెందిన నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే నిన్న జగన్ లేవనెత్తారు.

జగన్‌ విషయంలోనూ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Submitted by arun on Wed, 06/13/2018 - 16:45

ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి గేట్‌ వే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌, ప్రజాసంకల్ప యాత్ర, తూర్పు గోదావరి జిల్లాలోకి నిన్న ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్‌లోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి, గోదావరి బ్రిడ్జి మీదుగా, వంలాది కార్యకర్తల నినాదాలు, స్వాగతాల మధ్య రోడ్‌ కం రైలు బ్రిడ్జ్‌పై పాదయాత్ర చేస్తూ, తూర్పులోకి ప్రవేశించారు జగన్. 

తూర్పుగోదావరిలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

Submitted by arun on Tue, 06/12/2018 - 17:05

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోకి జగన్‌ అడుగుపెట్టారు. దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల పొడవు ఉండే.... రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జిపైకి అడుగుపెట్టిన జగన్‌కు వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.

ట్విట్టర్‌లో జగన్ పై లోకేష్ సెటైర్లు

Submitted by arun on Tue, 06/12/2018 - 14:15

సహజ వనరులను దోచుకుంటున్నారని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని.. ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్‌లో విమర్శించారు.. అసలు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న తర్వాత ఏమైనా మిగిలిందా అంటూ సెటైర్లు వేసిన లోకేష్... జగన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లుగా సహజ ఖనిజాలైన.. బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నాడన్నారు.. నీ మీద ఉన్న 13 ఛార్జ్ షీట్లలో నువ్వు దోచుకున్న మెనూ మొత్తం ఉందని ఒక్కసారి చూసుకో.. అంటూ విమర్శించారు.. రాష్ట్రంలో సహజవనరులను సీఎం, లోకేష్‌తో పాటు, టీడీపీ నేతలు దోపిడీ చేసి, దాచుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సందర్భంగా నిన్న జరిగిన సభలో ఆరోపించిన విషయం తెలిసిందే.

జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫోటో

Submitted by arun on Mon, 06/11/2018 - 11:27

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొవ్వూరులో కొనసాగుతోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ జగన్‌ ఫోటో పక్కన ఓ పక్క కృష్ణ, మరోపక్క నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. పాదయాత్రకు వచ్చిన వైకాపా కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాకయ్యారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన వ్యక్తి వైకాపా కార్యకర్త అయినప్పటికీ బాలకృష్ణ అభిమాని అని..

జగన్‌ పాదయాత్రకు అనుమతించని పోలీసులు

Submitted by arun on Sat, 06/09/2018 - 16:29

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గోదావరి బ్రిడ్జిపై నుంచి జగన్ పాదయాత్రకు.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్రకు మరో మార్గం ఎంచుకోవాలని.. రాజమహేంద్రవరం  డీఎస్పీ లేఖ రాశారు. బ్రిడ్జి కండీషన్‌ సరిగా లేదని.. పోలీసులు అనుమతి నిరాకరించారు.

జగన్‌ని కలిసిన రమణదీక్షితులు

Submitted by arun on Thu, 06/07/2018 - 17:17

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు... వైసీపీ అధినేత జగన్‌ని కలిశారు. జగన్‌తో 20 నిమిషాల పాటు చర్చించారు. తానేమీ రాజకీయాలు చేయడం లేదని, తాను చేసిన ఆరోపణలకు  కట్టుబడి ఉన్నానని అన్నారు. రమణదీక్షితులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వచ్చి జగన్‌తో ముచ్చటించారు. టీటీడీలో అవినీతి ఉందని, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు జగన్‌ ఈ విషయంపై ఇటీవల స్పందించి.. రమణ దీక్షితులు ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదని అన్నారు.

జగన్ పాదయాత్రపై తేనెటీగల దాడి

Submitted by arun on Thu, 06/07/2018 - 11:37

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.