National

వాజ్‌పేయిని విమర్శిస్తూ పోస్ట్.. ప్రొఫెసర్‌ను చితకబాదారు

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 20:31

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి గురించి బీహార్‌కు చెందిన ప్రముఖ కాలేజీ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అందులో వాజ్‌పేయి నెహ్రూ వాది కాదు. ఆయన వాగ్థాటి పటిమతో మధ్య తరగతి భారతీయులను హిందుత్వ రాజకీయాలకు దగ్గరయ్యేలా చేయగలిగారు. ఆయన్ను నెహ్రూ వాదిగా పేర్కొనడం సముచితం కాదు.. అలా అంటే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది అంటూ పోస్ట్ పెట్టారు. అతడి వాఖ్యలపై మండిపడ్డ కొంతమంది దుండగులు ప్రొఫెసర్‌ ను చితకబాదారు. భావ ప్రకటనా స్వేచ్చ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమంటూ ప్రొఫెసర్‌ను హెచ్చరించి వెళ్లిపోయారు.

దేవభూమిలో ప్రకృతి విలయతాండవం

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 19:53

దైవభూమిగా ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వస్తున్న  వరదలకు కేరళ ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చినా  ఎప్పుడూ ఏ వైపునుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. కేరళ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, విపత్తు నిర్వహణ బృందాలు రేయింబవళ్లు  ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.  దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

చేపలు అమ్ముకునే అమ్మాయి వరద బాధితులకు రూ.1,15,000 సాయం చేసింది..

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 16:54

స్పందించే హృదయం ఉండాలే కానీ ఏ చిన్న సాయమైనా చేయొచ్చని నిరూపించింది కేరళకు చెందిన మహిళ హనన్ హమీద్. ఆమెను చదువుకోవడం కోసం చేపలు అమ్ముకుంటుందని సామాజిక మాధ్యమాలు ట్రోల్ చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి పినరన్ రంగంలోకి దిగి ట్రోల్ చేస్తున్న వారిని  శిక్షించాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఆ అదృష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేసింది. దాంతో ఆమె పరిస్థితి చూసి ఆమె చదువుకోవాలని ఆశించి కొందరు దాతలు విరాళాల రూపంలో కొంత నగదును కూడా పంపారు. అయితే ఆ మొత్తం  లక్షా పదిహేనువేల రూపాయలను కేరళ వరద బాధితుల కోసం ఉపయోగించమంటూ ఇచ్చేసింది. తన పట్ల ఈ మాత్రం జాలి చూపించినందుకు ధన్యవాదాలు..

రైలుకిందపడి మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 16:32

రైలుకిందపడి ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఓడిషాలోని చత్రపూర్ రైల్వేస్టేషన్‌లో సమిపంలో జరిగింది.  సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు .తురాయి పట్టపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రఘునాథ్‌దాస్‌ కుమార్తె అర్చనాదాస్‌గా మృతురాలిని పోలీసులు గుర్తించారు కొన్నాళ్ల నుంచి భర్త అర్జున్‌దాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళైన నాలుగేళ్ల తర్వాత భర్తతో విభేదాలు రావడంతో అర్చనాదాస్‌ తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. ఇక  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

దొంగ చీమ...ఖరీదైన వజ్రాన్ని ఎత్తుకెళ్లి...

Submitted by arun on Sat, 08/18/2018 - 14:47

కొంత మంది మనుషులు దొంగ తనం చేయడం చూసి ఉంటాం. కొన్ని సార్లు కోతులు కూడా వాటికి నచ్చిన వాటిని ఎత్తుకెళ్లి జనాన్ని  నానా తిప్పలు పెడుతుంటాయి. కానీ ఓ చీమ ఖరీదైన వజ్రాన్ని ఎత్తుకెళ్లి ఔరా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలోని చీమ దొంగను మీరూ చూసేయండి.

అనగనగా ఓ చీమ ఆ చీమ నోట్లో ఖరీదైన డైమండ్‌.  చీమ నోట్లో డైమండ్‌ ఏంటీ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారా..? కానీ ఇది నిజం  చీమ లక్షలు  విలువై చేసే  వజ్రాన్ని చటుక్కున కొట్టేసింది చీమ ఏంటి దొంగతనం చేయడం ఏంటీ అనుకుంటున్నారా సైజ్‌లో చిన్నదని చులకనగా చూసే వారికి ఆ దొంగ చీమ చేసిన  పర్ఫామెన్స్‌ చూస్తే ఫిదా అవాల్సిందే.  

Tags

కేరళలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే...తక్షణ సాయం కింద ఐదు వందల కోట్లు విడుదల

Submitted by arun on Sat, 08/18/2018 - 13:27

గడచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కకావికలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ  తక్షణ సాయం కింద రాష్ట్రానికి ఐదు వందల కోట్ల సాయాన్ని ప్రకటించారు.  దీంతో పాటు  వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు  50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని వెల్లడించారు.  రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అరగంట పాటు హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన వరద నష్టంపై  సమీక్ష  సమావేశం నిర్వహించారు.

వరద నీటితో ఇళ్లంతా నిండిపోయింది..దయచేసి నన్ను కాపాడండి...

Submitted by arun on Sat, 08/18/2018 - 11:02

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్‌లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. NDRF టీమ్స్ సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ మరికొందరు నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

ఆ కేరళ ప్రెగ్నెంట్‌ వుమన్‌ పరిస్థితి...ఇంతకీ ఏమైంది?

Submitted by arun on Sat, 08/18/2018 - 10:38

నిండుచూలాలు. నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంటి చుట్టూ వరదనీరు. వాహనం రాలేదు. వాహనం పోలేదు. కదలడానికి వీల్లేదు. గర్భిణీకి పెయిన్స్‌ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆ ప్రెగ్నెంట్‌ వుమన్‌ సుఖంగా ప్రసవించిందా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్‌ రేపింది, ఆ కేరళ ప్రెగ్నెంట్‌ వుమన్‌ పరిస్థితి. ఇంతకీ ఏమైంది?

కేరళపై ప్రకృతి కన్నెర్ర, మునిగిన శబరిమల ఆలయం

Submitted by arun on Sat, 08/18/2018 - 10:05

ఆగస్టు 8వ తేదీ నుంచి వర్షాలు దంచి కొడుతుండటంతో కేరల జలవిలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయ్ సహాయక బృందాలు. 2వేల 94 క్యాంపులు ఏర్పాటు చేసి మూడున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్‌, కొచ్చి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్క రోజే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 82వేల మందిని సహాయక బృందాలు రక్షించాయ్.మరోవైపు పంపానది ఉధృతంగా ప్రవహించడం, వివిధ డామ్‌ల నుంచి గేట్లు ఎత్తివేడంతో అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో టెంపుల్‌ని మూసివేశారు.

వాజ్‌పేయికి నివాళి ఎందుకన్నాడు.. చెప్పుదెబ్బలు తిన్నాడు..

Submitted by arun on Sat, 08/18/2018 - 09:51

వాజ్‌పేయి అంత్యక్రియల వేళ..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీజేపీ, ఎంఐఎం మధ్య గొడవ జరిగింది. అటల్‌జీ మృతి పట్ల సంతాపం తెలిపే తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు ఎంఐఎం కార్పొరేటర్‌పై బీజేపీ సభ్యులు దాడికి దిగారు. దాంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమైంది. నివాళులర్పిస్తున్నసమయంలో ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మతీన్ వ్యతిరేకించాడు. మహానేతను తలుచుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తుండగా అడ్డుకున్నారు. ఆయనకు ఎందుకు నివాళి అర్పించాలని, తాను ఆ పని చేయనని అన్నారు.