Prashant Kishor

పీకే ఏకేస్తే.. ఎదురుగాలి ఉండదట...ఎదురుగాలికి తట్టుకునే గెలుపుగుర్రాలు

Submitted by arun on Mon, 10/15/2018 - 11:58

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై వైసీపీ అధినేత జగన్మోహన్‌‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న జగన్‌ వీక్‌గా ఉన్నచోట నిర్ధాక్షిణ్యంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన జగన్‌ ఇప్పుడు గుంటూరు జిల్లాపై ఫోకస్‌ పెట్టారు.

ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం....వైసీపీలో కోత్త పంచాయితీ....

Submitted by arun on Mon, 09/17/2018 - 10:07

ఎన్నికల వ్యూహాలు రచించడంలో గొప్ప పేరు దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా కీర్తి అధికారంలోకి వ‌చ్చేది మనమే.. అధికారం తెచ్చేది నేనే.. అంటూ అన్న ఆయనమాటలను సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ అధినేత సంవత్సరం తిరిగేలోపలే ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగా ఆయ‌న వేరే పార్టీలో చేరారు దీంతో ఆపార్టీ నేత‌లు షాక్ కు గుర‌య్యారు ఇంత‌కీ ఆయ‌న్ని ఇక‌పై పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా కొన‌సాగిస్తుందా లేదా ప్ర‌స్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా కొనసాతుతోంది. 

ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన...

Submitted by arun on Mon, 09/10/2018 - 12:50

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆదివారం రాత్రి ఆయన ముచ్చటించారు. గత రెండేళ్లుగా ఈ ఫీల్డ్‌ను వదిలివేయాలని ఉందని చెప్పిన ప్రశాంత్ కిషోర్... తాను ప్రారంభించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)సంస్థ బాధ్యతలను సమర్ధత ఉన్న వ్యక్తికి అప్పజెప్పాలని చూస్తున్నట్లు వివరించారు. గత ఆరేళ్లుగా తాను అనేక మంది ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశానని ఇకపై తాను తొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్‌కు కాని వెళతానని ప్రశాంత్ తెలిపారు.

నా దగ్గర డబ్బులే లేవు.. జగన్ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదు: ప్రశాంత్ కిషోర్

Submitted by arun on Mon, 09/10/2018 - 12:25

తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన, జగన్ నుంచి తాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజం లేదని ఆయన అన్నారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. 

పీకే టీమ్ సూచనతో జగన్ ఎలర్ట్...హద్దు దాటితే...

Submitted by arun on Wed, 07/11/2018 - 12:46

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు రూటు మార్చారు.. నిత్యం చంద్రబాబుపై విమర్శలతో  దూసుకుపోతున్న జగన్ ఇప్పుడు హటాత్తుగా తన స్వరం మార్చుకున్నారు.. గళం సర్దుకున్నారు.. 

సోషల్‌ మీడియా సమరానికి సై అంటోన్న వైసీపీ

Submitted by arun on Sat, 06/23/2018 - 11:04

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.... సోషల్‌ మీడియా సమరానికి సై అంటోంది. తూర్పుగోదావరిలో ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో... సోషల్ మీడియా టీమ్స్‌‌‌కి జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు వైసీపీ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాప్‌లను సిద్ధంచేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.

లోటస్ పౌండ్ లో ప్రశాంత్ కిషోర్ టీంతో జగన్ భేటి

Submitted by arun on Fri, 04/06/2018 - 15:31

వైసీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో తాజా పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. ఐదుగురు ఎంపీల నిరాహార దీక్షల నేపధ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా దీక్షలు,నిరసనలు నిర్వహించే అంశంపై చర్చించారు. దీంతో పాటు రాజీనామా చేసిన ఎంపీలతో ఫోన్లో మాట్లాడిన ఆయన ..ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామా చేశారంటూ అభినందించారు. ఆమరణ నిరాహార దీక్ష నేపధ్యంలో భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేశారు.  
 
 

జ‌గ‌న్ వ‌ర్గంలో క‌ల‌క‌లం..వైసీపీకి పీకే గుడ్ బై

Submitted by arun on Wed, 03/21/2018 - 11:39

2019 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ పెంచి అధికారం తీసుకొస్తాడని భావిస్తున్న పీకే వైసీపీకి దూరమవుతున్నారా ? ఎన్నికల వ్యూహకర్త అంటూ ప్లీనరిలో  కార్యకర్తలకు చేసిన పరిచయం గతంగా మారిందా ? అధినేత జగన్ ప్రశాంత్ కిషోర్ ల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతున్న మాట వాస్తవమేనా ? అంటే అవుననే సమాధానాలు లోటస్ పౌండ్ నుంచి ప్రజా సంకల్పయాత్ర వరకు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ ముగ్గురు నేతలే కారణమనే ప్రచారాలు  జోరుగా సాగుతున్నాయి. ఇంతకీజగన్ కు తెలియకుండా పీకే టీమ్‌ను నడిపిస్తున్న నేతలు ఎవరు.

అక్క‌డ ఆయ‌న ఉన్న‌ట్లా..లేన‌ట్లా

Submitted by lakshman on Tue, 03/20/2018 - 03:05

సీఎం చంద్ర‌బాబు వైసీపీ అధినేత జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పీ మ‌రి బీజేపీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం వైసీపీ - జ‌న‌సేన ను అడ్డంపెట్టుకొని టీడీపీని దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌లే ఆస‌క్తిక‌రంగా మారాయి. 
కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన జ‌గ‌న్ ..టీడీపీ త‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధించేందు దిశ‌గా ప్ర‌య‌త్నిస్తున్న త‌మ‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని సూచించారు. దీంతో డైల‌మాలో ప‌డ్డ చంద్ర‌బాబు వైసీపీ కి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.