mla babu mohan

కంటతడి పెట్టిన బాబుమోహన్‌

Submitted by arun on Thu, 10/11/2018 - 15:59

మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ కంటతడి పెట్టుకున్నారు. 25 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికానని, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించలేదంటూ వాపోయారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు నడి రోడ్డుపైన వదిలేశారని అన్నారు. తన సేవలను బీజేపీ గుర్తించిందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు బాబూ మోహన్‌.
 

సీఎం చంద్ర‌బాబును ఆకాశానికెత్తేస్తున్న టీఆర్ఎస్ నేత‌లు

Submitted by lakshman on Tue, 01/23/2018 - 11:15

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్ర‌బాబు, సీఎం కేసీఆర్ లు ఎవ‌రి ప‌రిపాల‌నలో వారు బిజీగా ఉంటున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లే ప‌రిష్కార మార్గంగా ప‌రిపాల‌న ద‌క్ష‌త‌తో అభివృద్ధి ప‌థంవైపు దూసుకెళుతున్నారు. రాష్ట్ర‌విభ‌జ‌న త‌రువాత కూడా నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న వీరిద్ద‌రు కయ్యానికి కాలు దువ్వే వారు. సంద‌ర్భాను సారం ఒక‌రిపై విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో కాక‌పుట్టించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రాలు వేరైనా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి ఉండాల‌నే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు.