Gangula Kamalakar

విమర్శిస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా

Submitted by arun on Thu, 10/11/2018 - 13:53

బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ క్రిమినల్ అని వ్యక్తిగత విమర్శలు చేస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా అని హెచ్చరించారు. నాది దొంగ వ్యాపారం అని భావిస్తే చేతనైతే ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అని, ఆ పార్టీ చీఫ్‌ జూటా షా అని గడ్కరీనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేది బీజేపీ పార్టీ అని విమర్శించారు.

గంగుల కమలాకర్‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Sat, 10/06/2018 - 14:20

మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో ఆయన స్పీడ్‌ బోటును పరిశీలించి దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ఎల్‌ఎండీలో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. అయితే లైఫ్‌ జాకెట్‌ వేసుకోవడం.. అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది ఆయన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్‌ స్పీడ్‌ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఎమ్మెల్యే సోదరుడి అనుమానాస్పద మృతి

Submitted by arun on Wed, 08/22/2018 - 10:52

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అనుమానాస్పదస్థితిలో బుధవారం ఉదయం మృతిచెందారు. ఉదయం కరీంనగర్‌ శివారులోని రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన పడి పోయి ఉండటం గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాకర్ మృతితో ఎమ్మెల్యే కమలాకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా...

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోందా..?

Submitted by lakshman on Tue, 01/23/2018 - 07:37

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు టీఆర్ఎస్ హెల్ప్ చేస్తుందా అంటే అవున‌నే అంటున్నారు టీకాంగ్ నేత‌లు. సోమ‌వారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసి యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్  పార్టీ కార్యకర్తలు - అభిమానులతో భేటీ అయ్యారు.  భేటీ అనంత‌రం  కరీంనగర్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన హోట‌ల్ లో బ‌స‌చేసిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ ఆ హోట‌ల్లో బ‌స చేయ‌డంపై స్థానిక కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.