motkupalli narasimhulu

వైసీపీ ‘టాస్క్‌ఫోర్స్‌’లో మోత్కుపల్లి.. రేపట్నుంచే ఆపరేషన్!

Submitted by arun on Fri, 06/15/2018 - 12:07

ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ‘ఆపరేషన్ చంద్రబాబు’ను వేగవంతం చేసింది. తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి ఇంటికి వచ్చిన విజయసాయి... మోత్కుపల్లితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీలో పర్యటిస్తానన్న మోత్కుపల్లితో విజయసాయి సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో కూడా మోత్కుపల్లి తిరుమల పర్యటనపైనే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మోత్కుపలిని విజయసాయి మర్యాదపూర్వకంగా కలిశారంటున్న వైసీపీ.... చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు ముందుకొచ్చిన కలిసి పనిచేస్తామని చెబుతోంది.

తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:41

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి .  చంద్రబాబు తన పాలనతో ఏపీని  అవినీతి ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.  ఎన్టీఆర్‌ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబు‌... టీడీపీని నందమూరి ఫ్యామిలీకి  అప్పగించాలని... లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్దిచెబుతారని ధ్వజమెత్తారు.  ప్రజాభీష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచే పోటీ చేస్తానన్న ఆయన  చంద్రబాబు ఓడిపోవాలని  మోకాళ్ల నొప్పులు ఉన్నా సరే  తిరుమల మెట్లు ఎక్కి మరీ మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు.

మోత్కుపల్లికి ఆంధ్రా నేతల నుంచి మద్దతు

Submitted by arun on Wed, 06/13/2018 - 10:21

సీనియర్‌ లీడర్‌ మోత్కుపల్లి నర్సింహులు‌ రాజకీయ జీవితం అయోమయంలో పడింది. తెలుగుదేశం నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని తెలంగాణలో ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. కనీసం పలకరించడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. అయితే పొరుగు రాష్ట్రం... ఏపీ నుంచి మాత్రం మోత్కుపల్లికి అనూహ్య మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కి వచ్చి మరీ... మోత్కుపల్లిని కలిసి సంఘీభావం ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మోత్కుపల్లికి గులాబీతీర్థం ఇచ్చేందుకు.. కీలకమంత్రి మంతనాలు ?

Submitted by arun on Wed, 05/30/2018 - 10:52

టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా.? సడన్‌గా కేసీఆర్‌పై ప్రేమ పుట్టుకు రావటానికి కారణమేంటి.? మోత్కుపల్లికి గులాబీతీర్థం ఇచ్చేందుకు.. కీలకమంత్రి మంతనాలు సాగిస్తున్నారా.? ఆయన చేరిక టీఆర్ఎస్‌కు లాభమా.. నష్టమా..?

బాబూ! ఏపీ ప్రజలు బొందపెడతారు, ఎన్టీఆర్‌ను చంపి..: మోత్కుపల్లి

Submitted by arun on Tue, 05/29/2018 - 16:55

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మామను వెన్నుపోటు పొడిచి చంపిన నరహంతకుడంటూ మండిపడ్డారు. పార్టీ జెండాను లాక్కున్న దొంగ అని, రాజకీయాల్లో చంద్రబాబు అంత నీతిమాలిన నాయకుడు ఇంకొకరు లేరు అని విరుచుకుపడ్డారు. ప్రపంచంలో చంద్రబాబు అంత నీచుడు లేడని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎప్పుడో సస్పెండ్ చేశారని మోత్కుపల్లి అన్నారు. ఏపీలో కూడా చంద్రబాబును బొంద పెట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.పార్టీ నేతలకు ఇబ్బంది వస్తే ఆదుకోలేదని అన్నారు.

టీడీపీకి గడ్డుకాలం...పార్టీని వీడుతున్న కీలక నేతలు

Submitted by arun on Tue, 05/29/2018 - 10:42

మొన్న రేవంత్..నిన్న మోత్కుపల్లి. ఇలా ఒక్కరుగా వెళ్ళిపోతున్నారు..వేరు వేరు కారణాలతో నేతలంతా టీడీపీకి గుడ్‌ బై కొట్టేస్తున్నారు. ఏడాదిలో ఎన్నికల్ని ఎదుర్కోబోతున్న పసుపు దళానికి..ఇది జీవన్మరణ సమస్యగా మారింది. రేపు ఎవరు వెళ్ళిపోతారో... అనే అనుమానాల మధ్య టీటీడీపీ పడవ సాగుతోంది. 
 

ఎన్టీఆర్‌ చావుకు బాబే కారణం.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 05/28/2018 - 12:26

సీఎం చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగతనం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. చివరకు కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. 

ప‌వ‌న్ ను బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తారు

Submitted by lakshman on Fri, 03/16/2018 - 10:16

తెలంగాణ టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు త‌మ అధినేత‌ను ప్ర‌స‌న్నం చేసుకునేలో ప‌డ్డార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా టీడీపీ , నారాలోకేష్ అవినీతి గురించి ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. ఏపీ టీడీపీ నేత‌లు అవినీతితో రాష్ట్రాన్ని బ్ర‌ష్టుప‌ట్టిస్తున్నార‌ని సూచించారు. ఎక్క‌డ చూసినా అవినీతి రాజ్య‌మేలుతుంద‌ని ..టీడీపీ నేత‌లు ఏపీని క‌ర‌ప్ష‌న్ ఆంధ్రాగా మార్చేస్తార‌ని ఎద్దేవా చేశారు. 

మోత్కుపల్లితో చంద్రబాబే మాట్లాడిస్తున్నారా?

Submitted by arun on Sat, 03/03/2018 - 06:50

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా నష్టపోతే.. తెలంగాణలో మాత్రం అది టీడీపీ వంతు అయ్యింది. కాంగ్రెస్ అంత దారుణంగా కాకున్నా.. ప్రస్తుతానికి ముఖ్య నాయకులు ఎవరూ లేనంత స్థాయికి టీడీపీ పరిస్థితి కాస్త తగ్గిపోయిందనే చెప్పవచ్చు. ఇలాంటి స్థితిలో.. పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

నా దారి రహదారి

Submitted by arun on Fri, 03/02/2018 - 18:20

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. తెగ మదనపడిపోతున్నారు. పార్టీలో తనకు కనీస గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి తనను పిలవకపోవడం బాధ కలిగించిందని బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిపైనా మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఉన్నన్నాళ్లూ పార్టీని భ్రష్టుపట్టించి.. చివరకు నిండా ముంచేసి జంప్ అయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ టీడీపీకి సరైన నాయకత్వం లేదని మరోసారి అన్నారు మోత్కుపల్లి. సరైన నాయకులు, నాయకత్వం లేకపోవడం వల్లే.. పార్టీ పరిస్థితి దుర్భరంగా తయారైందని చెప్పారు.