Sports

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

Submitted by nanireddy on Fri, 12/14/2018 - 08:34

పెర్త్‌లో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి టెస్టులో టీమిండియా చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్.. ఎలాగైనా రెండో టెస్టులో గెలవాలని ఉంది.. ఈ టెస్టులో కూడా విజయం సాధించి   సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇక భారత్ స్టార్ స్పిన్నర్ అశ్విన్, కీలక ఆటగాడు రోహిత్ శర్మ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. అశ్విన్‌, రోహిత్‌ శర్మ స్థానంలో హనుమ విహారి, ఉమేశ్‌ యాదవ్‌లకు కోహ్లి స్థానం కల్పించారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 9 ఓవర్లలో 34 పరుగులు. 

రెండో టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 19:44

అడిలైడ్ లో టెస్టులో విజయం సాధించి ఊపుమీద ఉన్న భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు ఆరంభానికి ముందే ఇద్దరు టీమిండియా కీలక ఆటగాళ్లు గాయం కారణంగా ఆటకు దూరమయ్యారు. శుక్రవారం పెర్త్‌ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అశ్విన్‌, రోహిత్‌ శర్మలు దూరమయ్యారు. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా వీరిద్దరూ గాయపడ్డారు. దాంతో ఫిట్ నెస్ కోల్పోవడంతో రెండో టెస్టులో స్థానం కోల్పోయారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్‌ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు. దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేశారు.

మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..

Submitted by nanireddy on Mon, 12/10/2018 - 10:57

అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా కంగారులను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్  లో ఓవర్ నైట్ స్కోర్  104/4 తో ఐదోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ లంచ్ విరామ సమయానికి మరో రెండు వికెట్లను చేజార్చుకుని 188 పరుగులు చేసింది. ఆ తరువాత వెనువెంటనే మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. దాంతో 291 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీంఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో ఉంది. 

విజయం దిశగా టీమిండియా..

Submitted by nanireddy on Mon, 12/10/2018 - 09:33

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ లంచ్‌ సమయానికి రెండు, ఆ తరువాత మరో రెండు వికెట్లు.. మొత్తం 8 వికెట్లను కోల్పోయి 238 పరుగులు చేసింది. ప్రస్తుతం కమిన్స్ 23 , లియోన్ 3 క్రీజులో ఉన్నారు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన షాన్‌ మార్ష్‌ 146 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు.

ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 323

Submitted by nanireddy on Sun, 12/09/2018 - 09:35

అడిలైడ్ టెస్టులో టీమిండియా 307 ప‌రుగుల‌కి ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 323 పరుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. లంచ్ కు ముందువరకు నిలకడగా ఆడిన టీమిండియా 50 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను చేజార్చుకుంది. 151/3 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 156 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. పుజారా(71), రహానే(70) ఆసీస్‌ బౌలర్లను ఎదురొడ్డి నిలిచినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాహుల్‌(44), కోహ్లి(34), పంత్‌(28) భారీ స్కోరు చేయలేకపోయారు. రోహిత్‌ శర్మ(1) విఫలమయ్యాడు.

అంత సులభం కాకపోవచ్చు.

Submitted by nanireddy on Sun, 12/09/2018 - 07:42

అడిలైడ్ టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. మూడోరోజు ఆస్ట్రేలియాను 235 పరుగులకు ఆలౌట్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ పోరాడినా... మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు త్వరగానే ఔట్ చేయడంతో కోహ్లీసేనకు 15 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత నిలకడగా ఆడుతోంది... పుజారా , కోహ్లీ పార్టనర్‌షిప్‌తో టీమిండియా పుంజుకుంది. లంచ్ విరామ సమయానికి భారత్ స్కోర్ 260 పరుగులు 5 వికెట్ల నష్టానికి. ఆసీస్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచే అవకాశముంటుంది. ఇప్పటికి 275 స్కోర్ లీడ్ లో ఉంది టీమిండియా.

కోహ్లీ డ్యాన్స్.. హోరెత్తిపోతున్న ట్విట్టర్

Submitted by chandram on Sat, 12/08/2018 - 18:06


ఆస్టేలియా-భారత్ టెస్ట్ మూడోరోజు ముచ్చటగా ముగిసింది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 151/3 నిలిచింది. ఇది ఇలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట ప్రారంభం కానున్న కొద్ది నిమిషాల్లో మైదానంలో జోరుగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను ఆస్టేలియా ట్వీట్ చేసింది దింతో సోషల్ మీడియాలో ఇగా ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ దూమ్మురేపుతోంది. ఇప్పటికే వందలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. లైక్స్, కామెంట్స్‌తో ట్వీట్టర్ మారుమోగుతోంది. కోహ్లీ ఆటగాడే కాదు మంచి డ్యాన్స్‌ర్ పొగుడుతున్నారు.

భారత్-ఆసీస్ టెస్టు.. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట..

Submitted by nanireddy on Sat, 12/08/2018 - 08:16

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం రూపంలో ఆటంకం కలిగింది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. త్వరగానే ఆసీస్ కీలక వికెట్ ను కోల్పోయింది. 15 పరుగులతో  స్టార్క్‌ వెనుదిరిగాడు. బూమ్రా మ్యాజిక్ చేసి స్టార్క్‌ ను పెవిలియన్ కు చేర్చాడు.  ఈ క్రమంలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 204 పరుగులు, 91.4 ఓవర్లు, హెడ్ 66 పరుగులతో రాణిస్తూ క్రీజులో ఉన్నారు. కాగా భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా 46 పరుగులు వెనుకబడి ఉంది.

నాకు ధోనితో విభేదాలు లేవు

Submitted by chandram on Fri, 12/07/2018 - 18:02

చాలా కాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్ కు మధ్య విభేదాలున్నాయన్న రూమర్లు చెక్కర్లు కొడుతున్నా విషయం తెలిసిందే. అయితే రూమర్ల్‌కు చెక్ పెడుతూ ఇరువురిపై వస్తున్నా వార్తాలను గౌతం తిప్పికొట్టారు. ధోనికి తనకు ఎలాంటి స్పర్థలూ లేవని స్పష్టం చేశాడు. అవన్నీ కేవలం పూకర్లు మాత్రమేనని వాటిని నమ్మకూడదని తమ మథ్య ఎటువంటి విభేదలు లేవని తెల్చేశాడు.