Telangana

పార్టీకి ఈసీ 10 నిమిషాలు...

Submitted by arun on Mon, 10/22/2018 - 17:15

మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం.. హైదరాబాద్‌ హోటల్‌ తాజ్‌కృష్ణకు చేరుకుంది. కాసేపట్లో గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం భేటీకానుంది. ఈ సమావేశంలో ఒక్కో రాజకీయ పార్టీకి 10 నిమిషాల సమయం కేటాయించారు. అనంతరం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, పోలీస్‌ నోడల్‌ అధికారులతో సీఈసీ టీమ్ భేటీకానుంది. రేపు ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో భేటీ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీఈవోలు, ఎస్పీలతో ప్రత్యేకంగా బృంద సభ్యులు సమావేశమవుతారు.

ఆలేరులో పాడి రైతుల ధర్నా

Submitted by arun on Mon, 10/22/2018 - 16:35

నల్గొండ జిల్లా ఆలేరులో పాడిరైతులు ఆందోళన బాట పట్టారు. పాలధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. నిత్యావాసరాలతోపాటు పాడి పోషణ పెరిగాయని అయినా పాల ధరలను మాత్రం పెంచడం లేదని రైతులు మండిపడుతున్నారు. మదర్ డెయిరీలో పాలు పోసే రైతులకు, పాల రేటు పెంచాలని కోరుతూ ఆలేరు రైల్వే గేటు వద్ద ధర్నా పాడి రైతులు ధర్నా చేపట్టారు. మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలు పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. రోడ్డుపై రైతులో ఆందోళతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

టీడీపీ వ్యూహం.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

Submitted by arun on Mon, 10/22/2018 - 15:04

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరు పెంచింది. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు.

వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి

Submitted by arun on Mon, 10/22/2018 - 14:45

డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ బాలింత బలైంది. సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ పెద్దపేగు కత్తిరించారు. పేగుకు సరిగా కుట్లు వేయకపోవడంతో ఇన్ఫెక్షన్‌ సోకి నెల రోజుల తర్వాత బాలింత చనిపోయింది. హైదరాబాద్‌ చౌటుప్పల్‌కు చెందిన శ్వేతను డెలివరీ కోసం వనస్థలిపురం లైఫ్‌ స్ప్రింగ్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు పెద్దపేగు కత్తిరించారు. పేగుకు సరిగా కుట్లు వేయకపోవడంతో ఇన్ఫెక్షన్‌ సోకి శ్వేత చనిపోయింది. దీంతో బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
 

టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్దాం ..

Submitted by arun on Mon, 10/22/2018 - 14:08

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ దృష్టితో చూడాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు ఆఫర్ చేసిన భవిష్యత్ అవసరాలు, కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళదామంటూ చెప్పారు. టీఆర్ఎస్ పరాజయమే లక్ష్యంగా కేడర్ పని చేయాలని బలం, విజయావకాశాలు ఉన్న చోటే పోటీ చేద్దామంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

టీ టీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబు భేటి ..

Submitted by arun on Mon, 10/22/2018 - 12:50

మహాకూటమి పొత్తులపై సీఎం చంద్రబాబు  టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల ఎంపికపై పోలీట్ బ్యూరోలో సుమారు గంట పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుత సమయంలో సీట్ల కంటే టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పని చేయాలంటూ సూచించారు. సీట్ల సర్ధుబాటు, పొత్తులపై కాంగ్రెస్ నేతలు తనతో చర్చించారన్న చంద్రబాబు 12 స్ధానాలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిపారు. అయితే తమకు బలమున్న స్ధానాల్లో పోటీ చేసేలా అవకాశమివ్వాలని తాను కోరినట్టు నేతలకు వివరించారు. 

మరో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్

Submitted by arun on Mon, 10/22/2018 - 11:19

మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అభ్యర్థిగా కె. మాణిక్ రావు, మలక్ పేట్ క్యాండెట్ గా చెవ్వా సతీష్ ల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే 105 మంది అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్ ..తాజా ప్రకటనతో అభ్యర్థుల సంఖ్య 107కు చేరుకుంది. 

సెకండ్ ఫేజ్...

Submitted by arun on Mon, 10/22/2018 - 11:04

కాంగ్రెస్ రెండో విడత ప్రచారానికి కసరత్తు చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని యోచిస్తోంది. మరోసారి ప్రచారానికి రాహుల్ గాంధీని రప్పించనుంది. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ హామీలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రచార కమిటీ భేటీలో హస్తం నేతలు నిర్ణయించారు. 

కూటమిలో సీట్ల కొట్లాట...అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధం కావాలని డిమాండ్

Submitted by arun on Mon, 10/22/2018 - 10:49

మహాకూటమిలో పొత్తులు పొసగడం లేదు. మహాకూటమిలోని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కూటమి కోసం అందరికంటే ముందుగా ప్రయత్నాలు చేసిన సీపీఐకి మహాకూటమిలో పరిణామాలు రుచించడం లేదు. అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని, సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని కూటమిలో భాగస్వామ్యపక్షాలైన సీపీఐ, టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీచేశాయి. 

అభ్యర్థులకు ప్రచార వ్యూహాన్ని దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ ...అలసత్వం వీడితే...

Submitted by arun on Mon, 10/22/2018 - 10:04

విజయదశమి వెళ్లిపోయింది.. ఇక విజయతీరాలను అందుకోవడమే మిగిలి ఉందని.. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా అలసత్వం వద్దంటూ సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుంటే ఈ సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని భరోసా ఇచ్చారు.