CM Chandrababu Naidu

మహారాష్ట్ర పోలీసులు ఏం చేయబోతున్నారు?

Submitted by arun on Sat, 09/15/2018 - 09:39

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టుకు హాజరవుతారా? నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ నోటీసులపై మొదటిసారి స్పందించిన చంద్రబాబు ఏం చెప్పారు? కోర్టు నోటీసుల్ని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారా? అసలు చంద్రబాబు ముందున్న ఆప్షన్స్ ఏంటి?

చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Submitted by arun on Fri, 09/14/2018 - 09:49

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడంతో తీవ్ర సంచలనమైంది. ఎనిమిదేళ్ల క్రితం కేసులో సడన్‌‌గా ఎన్బీడబ్ల్యూ ఇష్యూ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యాయి. ఇదంతా కుట్ర అంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. 

టీడీపీ బాబ్లీ ఉద్యమం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చంద్రబాబుతోపాటు మొత్తం 16మందికి నోటీసులు జారీ చేసిన మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు ఈనెల 21న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది.

ఉచిత సలహా ఇచ్చిన నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన రానా..!  

Submitted by arun on Sat, 08/04/2018 - 12:34

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుపాటి రానా. భళ్లాల దేవుడిగా ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రానా అంటే ప్రస్తుతం ఒక హీరో అని చెప్పే కంటే.. ఒక నటుడు అంటేనే కరెక్ట్ సరిపోతుంది. హీరో పాత్రకంటే సపోర్ట్ క్యారెక్టర్ల చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు. బాహుబలి, రాణి రుద్రమదేవి ఇలా తెలుగు చిత్రాలతో.. పాటు హిందీ, తమిళ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు రానా.

ఎన్నికల ఏడాది చంద్రబాబు సరికొత్త వ్యూహాలు...ఇకపై...

Submitted by arun on Wed, 07/18/2018 - 11:41

ఎన్నికల ఏడాదిలోకి ఎంటరవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాల విమర్శలకు చెక్‌ పెడుతూ వారానికి మూడ్రోజులు ప్రజల మధ్యే గడిపేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోన్న చంద్రబాబు గ్రామ దర్శినితో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబును కలిసిన ఉండవల్లి

Submitted by arun on Tue, 07/17/2018 - 09:56

నిన్నమొన్నటివరకూ కత్తులు దూశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని మాటల తూటాలు పేల్చారు. అనేక లేఖలతో ప్రభుత్వం యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు టార్గెట్‌గా ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు. అలాంటి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సడన్‌గా చంద్రబాబును ఎందుకు కలిశారు?. ఎప్పుడూ చంద్రబాబుపై విరుచుకుపడుతూ జగన్‌కు సపోర్ట్‌ మాట్లాడే ఉండవల్లి అమరావతి టూర్ వెనుక కారణమేంటి? 

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

Submitted by arun on Wed, 06/20/2018 - 07:01

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల డిమాండ్లపై కమిషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే అగ్రిగోల్డ్ సమస్యను 21 రోజుల్లో పరిష్కరించాలటూ సీఎస్‌‌కు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా లక్షమందికి పెన్షన్లు, మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌ల అప్పగింతపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఎంపీలు, మంత్రుల భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు

Submitted by arun on Sat, 06/16/2018 - 11:42

విభజన హామీలపై పోరుకు టీడీపీ మళ్ళీ సిద్ధమౌతోంది.వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని నిర్ణయించింది. ఎంపీలు, మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:41

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి .  చంద్రబాబు తన పాలనతో ఏపీని  అవినీతి ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.  ఎన్టీఆర్‌ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబు‌... టీడీపీని నందమూరి ఫ్యామిలీకి  అప్పగించాలని... లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్దిచెబుతారని ధ్వజమెత్తారు.  ప్రజాభీష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచే పోటీ చేస్తానన్న ఆయన  చంద్రబాబు ఓడిపోవాలని  మోకాళ్ల నొప్పులు ఉన్నా సరే  తిరుమల మెట్లు ఎక్కి మరీ మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు.

కడప జిల్లా నాయకులకు క్లాస్ పీకిన చంద్రబాబు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:52

ఎంపీ సీఎం రమేష్-వరదరాజులు రెడ్డి వివాదంపై కడప జిల్లా టీడీపీ నాయకులకు చంద్రబాబు క్లాస్ పీకారు. కలిసి పనిచేసుకోకుండా కలహాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య ఈ తరహా విభేదాలు కరెక్ట్ కాదన్న బాబు... రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే.. బీజేపీకి పట్టిన దుర్గతే పడుతుందని సూచించారు.

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ

Submitted by arun on Tue, 06/05/2018 - 17:07

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న చంద్రబాబు ఉపఎన్నికలు రాకూడదనే రాజీనామాలు ఆమోదించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్న చంద్రబాబు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని వస్తే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఉపఎన్నికలు వచ్చుంటే బీజేపీ, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్న చంద్రబాబు 2019 ఎన్నికలు ఎలా ఉండేవో ఇప్పుడే తేలిపోయేదన్నారు.