ap cm chandrababu

సెక్యులరిజం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు: అసదుద్దీన్ ఓవైసీ

Submitted by arun on Thu, 11/01/2018 - 17:50

ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో భాగస్వామిగా ఉన్నారని, ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింల ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు సెక్యులరిజం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. 

బాబ్లీ ఎపిసోడ్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

Submitted by arun on Fri, 09/14/2018 - 16:49

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి సీఎం హారతిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఫస్ట్ టైం స్పందించారు. తాను ఎక్కడ అన్యాయం చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏ పనిచేసినా ప్రజల కోసమేనని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టులపై ప్రాజెక్టులు కడితే, ఉత్తరతెలంగాణ ఎడారి అవుతుందనే నిరసన తెలిపడానికి అక్కడికి వెళ్లామని చంద్రబాబు తెలిపారు.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 06/07/2018 - 17:29

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్... లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడలో తన కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తానని స్పస్టం చేశారు. విజయనగరం జిల్లాలో మూడురోజులపాటు పర్యటిస్తున్న లక్స్మీనారాయణ జట్టు... ఆశ్రమంలో అరెకరంలో అన్నపూర్ణ పథకాన్ని పరిశీలించారు. తనకు ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన గరుడ గురించి తెలుసని, ఆపరేషన్‌ గరుడ గురించి తనకు తెలీదన్నారు. తాను కుట్రలో భాగం అంటూ చేసిన ఆరోపణలపై న్యాయనిపుణులను సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
 

బాబు దీక్షతో...హోదా హోరెత్తుతుందా?

Submitted by arun on Thu, 04/19/2018 - 15:11

ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కేంద్రం వైఖరికి నిరసనగా 68 ఏళ్ల వయసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేయబోతున్నారు. ఈ నెల 20న అంటే ఆయన పుట్టిన రోజున నిరాహార దీక్ష చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్లతో దీక్షకు కూర్చుంటున్న బాబు నిర్ణయానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది.

శ్రీరెడ్డి... ఈసారి టార్గెట్ కేసీఆర్, బాబు!

Submitted by arun on Tue, 04/10/2018 - 16:23

హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, ఈసారి తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసింది. మంగళవారం ఉదయం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా విచారకరం’ అంటూ వ్యాఖ్యానించింది.  తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తంచేసింది శ్రీరెడ్డి. ఐతే, ఆమెకి సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ‘మా’ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వ్యూహాత్మకంగా ఇరుక్కుపోయిన బాబు

Submitted by arun on Wed, 03/28/2018 - 13:56

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వ్యూహాత్మక ప్రణాళికలో ఇరుక్కుపోయినట్టే కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే.. చంద్రబాబు తన మెదడుకు అందని పరిణామాల్లో చిక్కుకున్నట్టుగా అర్థమవుతోంది. ఒకప్పుడు బీజేపీతో సంబంధం పెట్టుకుని.. తర్వాత తెగదెంపులు చేసుకుని.. 2014లో మరోసారి జట్టు కట్టి ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు.. తర్వాత ఆ పార్టీతో ఇబ్బంది పడడం మొదలైంది.

ఎంపీ జేసీపై సీఎం చంద్రబాబు సెటైర్‌

Submitted by arun on Mon, 03/12/2018 - 15:41

'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సెటైర్ వేసిన ఆసక్తికర ఘటన అమరావతి అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీకి చెందిన ఎంపీలంతా ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా, లాబీలో ఆయనే జేసీకి ఎదురయ్యారు. దీంతో ఆయన 'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' అంటూ సెటైర్ వేశారు.

చంద్రబాబు గాలి తీసేసిన కడియం!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:37

కడియం శ్రీహరి.. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రే కావొచ్చు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడే అయి ఉండొచ్చు. కానీ.. ఒకప్పుడు టీడీపీలో కూడా కడియం శ్రీహరి అగ్ర నాయకుడిగా ఎదిగారు. మంత్రి అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా గెలిచి.. రాజీనామా చేసి చివరికి ఎమ్మెల్సీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. అలాంటి చంద్రబాబు మాజీ అనుచరుడు కడియం ఇప్పుడు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

‘తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్’

Submitted by arun on Thu, 03/01/2018 - 12:46

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉంది. ఆయన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఇకపోతే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఉన్నారు. అయితే, ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడుగా యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చేయాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదీ కూడా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే.

తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన చంద్రబాబు

Submitted by arun on Wed, 02/28/2018 - 16:31

‘‘ప్రతికూలతల నుంచి అవకాశాలను వెతుక్కోవాలి’’ విభజిత రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి చర్చకొచ్చిన ప్రతిసారీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే మాట ఇది. ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తే తన రాజకీయ జీవితంలోనూ అదే సూత్రం పాటించినట్లు అర్థమవుతుంది. రాజకీయాల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ తెలుగు చానల్‌తో మాట్లాడిన ఆయన అనేక విషయాలు ముచ్చటించారు. అందులో భాగంగా ఆయన రాజకీయాల్లో తన సక్సెస్ సీక్రెట్ ఒకటి చెప్పారు.