PrajaSankalpaYatra

టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుంది : జగన్

Submitted by arun on Thu, 03/08/2018 - 10:17

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని అన్నారు. టీడీపీ కలసి వస్తే మార్చి 21 కి ముందు అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు. వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలని లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుందని జగన్ ప్రకటించారు. 

ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు : జగన్

Submitted by arun on Thu, 03/08/2018 - 10:09

కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రజా విజయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని  అరుణ్ జైట్లీ...మొదటి నుంచీ చెబుతున్నారనీ...కానీ చంద్రబాబే పూటకో మాట మాట్లాడారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందంటూ చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు శాలువాలు కప్పలేదా అని ప్రశ్నించారు. చివరికి వైసీపీ రాజీనామాల అల్టిమేటంతో పాటు..ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు.

జగన్ పాదయాత్రలో అగ్నిప్రమాదం..

Submitted by arun on Wed, 02/14/2018 - 14:29

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో బుధవారం చిన్న అపశృతి దొర్లింది.  నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర తెల్లపాడు క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే... తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఆ బాణసంచా కాస్తా రోడ్డు పక్కనే ఉన్న పొదలు, ఎండుగడ్డిపై పడటంతో... అక్కడ మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలముకుంది. ఆ మంటలను దాటి ముందుకు సాగడానికి పాదయాత్రకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు జగన్ ను సురక్షితంగా మంటలు వ్యాపించిన ప్రదేశం నుంచి దాటించారు.

చంద్ర‌బాబు ఓటుకు మూడు వేలు ఇస్తారు.. తీసుకోండి!: జ‌గ‌న్

Submitted by arun on Mon, 02/05/2018 - 18:58

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎన్నో మాయమాటలు చెప్పిన తనను ప్రజలు ఇక నమ్మబోరని చంద్రబాబు భావించే అవకాశం కూడా ఉందని అందుకే, ఓటు వేయమని డబ్బులు ఇస్తారని వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌ పాదయాత్రలో అపశృతి..

Submitted by arun on Sat, 01/27/2018 - 13:42

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో  అపశృతి చోటుచేసుకుంది. నేడు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

శ్రీకాళహస్తిలో జగన్‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Sun, 01/21/2018 - 17:19

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తిలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో సభా వేదిక కూలి పోయింది. ఈ ప్రమాదంలో జగన్ సురక్షితంగా బయటపడ్డారు. పది మంది వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ప్రజల కష్టాలు, కడగండ్లను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. జగన్ పాదయాత్ర 67వ రోజు జగన్‌ చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్.

900 కి.మీ దాటిన జగన్ పాదయాత్ర

Submitted by arun on Sun, 01/21/2018 - 12:14

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం నాటికి 900 కిలోమీటర్లు దాటింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా దాదాపు మూడు వేల కిలోమీటర్లు, ఆరు నెలలపాటు జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్ రావి మొక్కను నాటారు.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Submitted by arun on Mon, 01/15/2018 - 12:22

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్‌ వద్ద ఆయన పండుగ వేడుకల్లో ఉత్సాహంగ పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్‌ జగన్‌.. పంచె, కండువా ధరించారు. పారకాల్వలో  వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ప్రజలకు జగన్ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. 

చంద్రబాబు సీఎం ఐతే చాలు.. ఆ ఫ్యాక్టరీలు మూతబడతాయి!

Submitted by arun on Mon, 01/08/2018 - 18:31

చంద్రబాబు తన సొంత కంపెనీ లాభాల కోసం చిత్తూరు డైరీని.. పధకం ప్రకారమే మూసివేయించారని జగన్‌ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర  పూతలపట్టుకు చేరింది. హెరిటేజ్‌ ఫ్యాక్టరీ కోసమే దుర్భుద్ధితో చంద్రబాబు దగ్గర ఉండి, చిత్తూరు డైరీని మూసేసే పరిస్థితి తెచ్చారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయితే చాలు.. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతాయని, అందుకు నిదర్శనం చిత్తూరు జిల్లాలోని చక్కర ఫ్యాక్టరీలేనన్నారు. 

ప్రశ్నిస్తే తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారు: జగన్

Submitted by arun on Sat, 01/06/2018 - 15:32

నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్‌ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తామన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో ఒక్కో కులానికి హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తర్వాత అందర్నీ దగా చేశారని విమర్శించారు.