PrajaSankalpaYatra

3వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌ పాదయాత్ర

Submitted by arun on Mon, 09/24/2018 - 16:23

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ,  ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  మరో అరుదైన మైలురాయిని దాటింది. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలో రావి మొక్క నాటిన జగన్‌ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్‌ ఆశిష్కరించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.

పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు

Submitted by arun on Tue, 09/18/2018 - 15:28

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్ వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు.. ఈ సందర్భంగా జగన్‌తో కలిసి కొంత దూరం నడిచారు. కాగా.. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

సోషల్‌ మీడియా సమరానికి సై అంటోన్న వైసీపీ

Submitted by arun on Sat, 06/23/2018 - 11:04

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.... సోషల్‌ మీడియా సమరానికి సై అంటోంది. తూర్పుగోదావరిలో ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో... సోషల్ మీడియా టీమ్స్‌‌‌కి జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు వైసీపీ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాప్‌లను సిద్ధంచేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.

తూర్పుగోదావరిలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

Submitted by arun on Tue, 06/12/2018 - 17:05

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోకి జగన్‌ అడుగుపెట్టారు. దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల పొడవు ఉండే.... రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జిపైకి అడుగుపెట్టిన జగన్‌కు వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.

రాజీనామా చేసిన ఎంపీలకు నా సెల్యూట్‌: జగన్

Submitted by arun on Wed, 06/06/2018 - 17:43

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలుచేసి ఆమోదింపజేసుకున్న వైసీపీ ఎంపీలను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. వైసీపీ ఎంపీల ధైర్యానికి త్యాగానికి సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేసుంటే... కేంద్రం దిగొచ్చేదన్న జగన్‌... తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బురద చల్లుతున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు 14నెలల ముందు రాజీనామాలు చేస్తే... ఎందుకు ఉపఎన్నికలు రావంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న జగన్‌.... ఉపఎన్నికలు వస్తే తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా రావన్నారు జగన్మోహన్‌రెడ్డి.

జగన్‌కు సీఎం అయ్యే అవకాశాలున్నాయి: కృష్ణ

Submitted by arun on Wed, 06/06/2018 - 14:12

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని.. సూపర్ స్టార్ కృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు కురుస్తున్నా.. జగన్ తన పాదయాత్రను కొనసాగించారంటూ చెప్పారు. ఎక్కడ సభ నిర్వహించినా.. కిక్కిరిసిపోయిన జనం చూస్తే.. జగన్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు వచ్చినట్లే అని కృష్ణ తన మనస్సులో మాటను చెప్పారు. జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. ఇద్దరూ ఒకేసారి ఎంపీగా కలిసి పనిచేశామని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుమారుడిగా జగన్ రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారని..

జగన్ పర్యటించిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి

Submitted by arun on Sat, 03/31/2018 - 15:45

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైయస్ వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై జగన్ విమర్శలు వర్షం కురిపించారు. జగన్ విమర్శలపై శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.  ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో జగన్ పర్యటించిన ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లను చల్లి రోడ్లను శుద్ధి చేశారు. జగన్ రాకతో తమ ప్రాంతం మలినమైందని.. అందుకే శుద్ధి చేస్తున్నామని తెలిపారు.

మరో మైలురాయిని దాటిన ప్రజాసంకల్పయాత్ర

Submitted by arun on Wed, 03/28/2018 - 11:30

ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయిని అందుకుంది. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర మంగళవారం 121 వ రోజున 16 వందల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నమ్మించు వంచించు అనే సూత్రాన్ని పాటిస్తూ చంద్రబాబు జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో పాదయాత్ర 16 వందల కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌ అక్కడ ఓ రావి మొక్కను నాటారు. తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించారు. 

జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం

Submitted by arun on Mon, 03/19/2018 - 11:51

ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..!. ఇదంతా ఏ కల్పితం కాదండోయ్.. పంచాంగ కర్తలు చెబుతున్న మాటలు. ‘ప్రజా సంకల్ప యాత్ర’లో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంప్రదాయ వస్త్ర ధారణతో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన్ను స్వాములు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం.. పంచాంగ కర్తలు.. జగన్ పంచాంగం చూశారు.

టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుంది : జగన్

Submitted by arun on Thu, 03/08/2018 - 10:17

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని అన్నారు. టీడీపీ కలసి వస్తే మార్చి 21 కి ముందు అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు. వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలని లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుందని జగన్ ప్రకటించారు.