CM Chandrababu

డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ

Submitted by chandram on Fri, 11/09/2018 - 20:22

డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చకు చెన్నైవెళ్లిన చంద్రబాబు. విమానశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చన్ని అందించారు. సీఎం చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర వెళ్లారు. అనంతరం రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు.

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

Submitted by arun on Fri, 11/09/2018 - 16:40

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల11న ఉదయం 11గంటల 45 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ జరగదనుందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ఈసారి ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చోటు కల్పించనున్నారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కిడారి సర్వేస్వరరావు కుమారుడు శ్రవణ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఫరూక్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రజావేదికలో ఈ నెల 11న మంత్రివర్గ విస్తరణ జరగనుంది.  

చంద్రబాబుపై విరుచుకపడ్డ పవన్ కల్యాణ్

Submitted by arun on Sun, 11/04/2018 - 12:42

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో, ఉసరవెళ్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది, అలిసిపోయి ఉన్నారని పవన్ కల్యాన్ ట్వీట్ చేశారు. మీ నోటితో ప్రజల మీద చేసే అఘాయిత్యాలు ఆపేయాలని, ఇక భరించలేకుండా ఉన్నామని చంద్రబాబుపై  పవన్ కల్యాణ్ విరుచుకపడ్డారు.

కలిసికట్టుగా సాగితేనే టికెట్లు...

Submitted by arun on Sun, 11/04/2018 - 10:45

ప్రకాశం జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా సాగితేనే టికెట్లు దక్కుతాయంటూ తెగేసి చెప్పారు. జిల్లాలో పార్టీ బలంగా ఉన్నా నాయకుల మధ్య విభేదాలతోనే సమస్యలు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా...

Submitted by arun on Sat, 11/03/2018 - 13:05

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రాష్ట్ర రాజకీయాలున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి తన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అధికార దాహం తప్ప చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. చంద్రబాబు స్టాట్యూ ఆఫ్‌ ఆపర్చునిటీగా మారారని 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని కన్నా జోస్యం చెప్పారు. నాడు మోదీని దేవుడన్నారని ఇప్పుడు నిందిస్తున్నారన్నారు. సోనియాను కూడా చంద్రబాబు గతంలో తిట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు యూటర్న్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్

Submitted by arun on Sat, 11/03/2018 - 10:24

రెండ్రోజుల ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీలో సమస్యలపై దృష్టి పెట్టారు. టీడీపీలో సమస్యాత్మకంగా మారిన యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలపై ఒంగోలులో రాత్రంతా సమీక్ష చేశారు. ఈ సమావేశం అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది. అయితే యర్రగొండపాలెం నియోజకవర్గ సమక్షలో చంద్రబాబు స్థానిక నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి గంటకు పైగా సాగిన సమీక్షలో యర్రగొండపాలెం నేతలు తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరికలు చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై సీరియస్ అయిన చంద్రబాబు పద్ధతి మార్చోకోవాలని ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.

బచ్చా చిటికేస్తే బాబు ఢిల్లీకి వెళ్లడమేంటి?: ఎంపీ జీవీఎల్

Submitted by arun on Thu, 11/01/2018 - 12:41

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్‌ డైపర్లు వేసుకునే వాడని అన్నారు. అలాంటి బచ్చా అఖిలేష్‌ చిటికేస్తే ఢిల్లీ వెళ్లడం సిగ్గనిపించడం లేదా అంటూ జీవీఎల్‌ చంద్రబాబును ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చడం కాదా అంటూ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు. 
 

రేపు ఢిల్లీకి చంద్రబాబు.. ఏం జరగబోతోంది?

Submitted by arun on Fri, 10/26/2018 - 17:26

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్ గరుడ అంశాలను ఆయన దేశం దృష్టికి తీసుకురానున్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటుందని సీరియస్‌గా ఉన్న చంద్రబాబు కేంద్రం ఏపీకి మొండిచేయి, విభజన హామీలు నెరవేర్చకపోవడం, తిత్లీ తుపానుపై స్పందించకపోవడం లాంటి అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. 

టీడీపీ డ్రామాలు నడుపుతోంది

Submitted by arun on Fri, 10/26/2018 - 12:32

టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. వారి చిల్లర రాజకీయాలు తెలంగాణలో నడవవని.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించిన ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌పై దాడి జరిగితే.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. ఘటనను కేంద్రం, తెలంగాణపైకి తోసేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

టీ టీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబు భేటి ..

Submitted by arun on Mon, 10/22/2018 - 12:50

మహాకూటమి పొత్తులపై సీఎం చంద్రబాబు  టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల ఎంపికపై పోలీట్ బ్యూరోలో సుమారు గంట పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుత సమయంలో సీట్ల కంటే టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పని చేయాలంటూ సూచించారు. సీట్ల సర్ధుబాటు, పొత్తులపై కాంగ్రెస్ నేతలు తనతో చర్చించారన్న చంద్రబాబు 12 స్ధానాలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిపారు. అయితే తమకు బలమున్న స్ధానాల్లో పోటీ చేసేలా అవకాశమివ్వాలని తాను కోరినట్టు నేతలకు వివరించారు.