డోప్ పరీక్షల్లో దోషిగా తేలిన యూసుఫ్ పఠాన్

Submitted by arun on Tue, 01/09/2018 - 15:20
Yousuf Pathan

బరోడా బ్లాస్టర్ యూసుఫ్ పఠాన్ డోప్ పరీక్షల్లో దొరికిపోయాడు. ఇటీవలే నిర్వహించిన డోప్ పరీక్షలో యూసుఫ్ పఠాన్ నిషేధిత టెర్ బుటా లైన్ అనే ఉత్ర్పేరకాన్ని వాడినట్లు తేలింది. దీంతో ఈ సీజన్లో తమజట్టు
ఆడే దేశవాళీ మ్యాచ్ ల కోసం యూసుఫ్ పఠాన్ ను ఎంపిక చేయరాదని బరోడా క్రికెట్ సంఘానికి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, వన్డేల్లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించిన యూసుఫ్ పఠాన్ 2017 రంజీ సీజన్లో కేవలం ఒకే ఒక్కమ్యాచ్ లో పాల్గొన్నాడు. అదే సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షలో దోషిగా తేలాడు. భారత క్రికెట్ చరిత్రలో డోప్ పరీక్షలో దొరికిపోయిన రెండో క్రికెటర్ గా యూసుఫ్ పఠాన్ నిలిచాడు. 2012 ఐపీఎల్  సీజన్ సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఢిల్లీ కమ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ దోషిగా తేలి 18 మాసాల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత డోప్ పరీక్షలో దోషిగా తేలిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్ మాత్రమే. మరి యూసుఫ్ పఠాన్ పై ఎంతకాలం నిషేధం పడుతుందన్నది రానున్నరోజుల్లో తేలనుంది.

 

 

English Title
Yusuf Pathan Suspended by BCCI

MORE FROM AUTHOR

RELATED ARTICLES