శ్రీరెడ్డి ఆడియో టేపులో వైసీపీ ప్రస్తావన

Submitted by arun on Thu, 04/19/2018 - 11:43
sri

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. అలాగే ఆమె తన కు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం నేను చేస్తూనే ఉంటాను అని తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి సంబంధించిన 12 నిమిషాల ఆడియో టేప్ ఒకటి  బయటపడింది. వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేసుకుని తన దగ్గరకు వచ్చారని అందులో పేర్కొంది. వివాదంలో తనను వాడుకోవాలని ప్రయత్నించారని, ఇంకా ఇరికిద్దామని చూశారని అయితే తన ఏడుపు చూసి కొద్దిగా తగ్గారని చెప్పింది. ఢిల్లీ స్థాయికి తన సమస్యను తీసుకువెళ్తానని శ్రీరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఆడియో టేపు సంచలనం రేపుతోంది. శ్రీరెడ్డి వివాదం వెనుక ఎవరో ఉన్నారంటూ కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కీలకంగా మారబోతున్నాయి.

English Title
ysrcp shock srireddiy latest updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES