కృష్ణా జిల్లా కలెక్టర్‌ ను అభినందించిన వైసీపీ!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 12:10
ycp leaders congratulate krishna distric colecter

 కృష్ణా జిల్లా కలెక్టర్ ను అభినందించింది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలైన కే. పార్ధసారధి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు,  ఎంవిఎస్ నాగిరెడ్డిలు కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు.. పార్టీలకతీతంగా అందరికి సమానంగా సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారని కలెక్టర్‌ బి.లక్ష్మీ కాంతంను వారు కొనియాడారు.జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడంలో అందరి అభిమానాన్ని చూరగొనడం గర్వించదగ్గ విషయం అని వైసీపీ నేతలు అన్నారు. పలు ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం వైసీపీ నేతలు కలెక్టర్‌ క్యాంప్‌ కార్యా లయంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ కాంతం సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

English Title
ycp leaders congratulate krishna distric colecter

MORE FROM AUTHOR

RELATED ARTICLES