కన్యత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 11:30
yaashika-aanand-virginity-comments-creates-troubles

 గతకొన్ని రోజుల నుంచి సినీమా నటీనటులు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. అందులో హీరోయిన్లు అయితే మరి ఘోరం.. ఇటీవల ఓ హీరోయిన్ ఏకంగా కన్యత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో  జనం చేత చివాట్లు తింటోంది.. వివరాల్లోకి వెళితే మళయాళ నటి యాషిక ఆనంద్‌ నటించిన చిత్రం తాజా చిత్రం 'ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు' అడల్ట్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఎక్కువగా అడల్ట్ దృశ్యాలు   ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది.. సినిమా మంచి హిట్ అవ్వడంతో    హీరోయిన్ యాషిక ఆనంద్‌ సంతోషంలో మునిగిపోయారు.. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 'పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పు చేయటం సరైందేనా? అన్న ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ... 'అందులో పెద్ద విషయం  ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అందులో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది' అంటూ కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకేముంది ఆమె మాటలు కాస్త సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారాయి.దాంతో ఆమెపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. 

English Title
yaashika-aanand-virginity-comments-creates-troubles

MORE FROM AUTHOR

RELATED ARTICLES