బ్యూటిపార్లలో హెయిర్ స్ట్రీట్నిింగ్ : జుట్టురాలుతుందది ఆత్మహత్య

Submitted by admin on Mon, 09/03/2018 - 22:16

మనషికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం,అన్నిటికన్నా తక్కువ అవసరం ఉన్నది అందం.కాని చాలా మంది అందానికి ఇచ్చినంత విలువ ఆత్మవిశ్వాసానికి ఇవ్వరు.ఆత్మవిశ్వాసం లోపించడమే ఒక యువతి పాలిట శాపంగా మారి ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసింది. అసలు విషయంలోకి వెళ్తే కొడగు జిల్లాకు చెందిన నేహా, మైసూర్ లో ఒక పెయింగ్ గెస్ట్ లో నివాసం ఉంటూ దగ్గరలో ఓ కాలేజిలో బి.బి.ఏ చదువుతుంది.కొన్ని రోజుల క్రితం దగ్గరలో ఉన్న ఒక బ్యూటీ పార్లలో హెయిర్ స్ట్రీట్నిింగ్ చేయించుకుంది.అది జరిగిన రెండోవ రోజు నుంచి అతి దారుణంగా జుట్టు రాలడం మొదలు పెట్టింది.అదే విషయాన్ని ఫోన్ ద్వారా తన తల్లితో కూడా పంచుకుంది.రాను రాను జుట్టు రాలడం పెరగడంతో బట్టతల వస్తుందని, తన స్నేహితులు ఎడిపిస్తారు అనే భయంతో ఆగస్టు 28 న రూం నుంచి వెళ్ళిపోయి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

గత 2 రోజుల నుంచి రూమ్ కు లేదు అనే భయం ఇంటి ఓనర్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పడం వారు పక్కనే ఉన్న జయలక్ష్మిపుర పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. సెప్టెంబర్ 2 నదీ తీరంలో ఒక శవం ఉందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు,తల్లిదండ్రులకు చూపించగా వారు చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా తమ కూతురే అని గుర్తుపట్టారు.పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యూటీ పార్లల్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

English Title
women suicide because of hair loss

MORE FROM AUTHOR

RELATED ARTICLES