మాయమాటలు చెప్పి భార్యను అమ్మేసిన భర్త

Submitted by arun on Thu, 08/09/2018 - 16:54
kamala

జీవితాంతం తోడు ఉండాల్సిన భర్తే నయవంచకుడిగా మారాడు. నమ్మిన భార్యనే నట్టేట ముంచేశాడు. ఆర్థిక సమస్యలను అధిగమించాలంటే నువ్వు దుబాయ్ వెళ్లాల్సిందేనని భార్యకు మాయమాటలు చెప్పాడు. నమ్మించి, ఫ్లైట్ ఎక్కించాడు. దేశం కాని దేశం వెళ్లాకగానీ, ఆ అమాయకురాలికి అసలు విషయం తెలిసింది. కట్టుకున్నవాడి చేతిలోనే తాను నిలువునా మోసపోయానని అర్థమయ్యింది. డబ్బు కోసం భర్తే తనను అమ్మేశాడని తెలిసి కుమిలిపోయింది. అక్కడి వాళ్లు పెట్టిన ఇబ్బందుకు నరకయాతన పడింది. 

నిజామాబాద్ జిల్లా చౌట్ పల్లి గ్రామానికి చెందిన కమలకు సుదర్శన్ తో ఇరవై ఏళ్ల క్రితం పెళ్లైంది. మొదటి భార్య నుంచి దూరంగా ఉంటున్న సుదర్శన్, కమలను పెళ్లి చేసుకున్నాడు. తాగుడుకు అలవాటుపడ్డ అతడు భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీరాలంటే గల్ఫ్ వెళ్లి, అరబ్ షేక్ ల వద్ద ఇంటి పనులు పనిచేస్తే మంచి జీతం ఇస్తారని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని భార్యను నమ్మించాడు. ఏజెంట్ రాజుతో చేతులు కలిపి, కమలను గత ఏడాది మేలో విమానం ఎక్కించారు. తీరా మస్కట్ కి వెళ్ళాక ఆమెకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. 

రోజుకు 8 గంటలే పని అని చెప్పి 18గంటలు పాటు పని చేయించుకుంటూ కనీసం తిండి కూడ సరిగ్గా పెట్టలేదు. కనీసం జీతం కూడా ఇవ్వకపోవడంతో ఈ విషయం మస్కట్ లో ఉన్న ఏజెంట్ ఫోన్ చేసి చెప్పింది. అక్కడి వేధింపులను తట్టుకోలేక పోతున్నాని తనను ఇండియాకు పంపాలని కోరింది. ఆమెను భర్తే, అరబ్ షేక్ కు అమ్మేశాడని ఎజెంట్ చెప్పాడంతో షాక్ కు గురయ్యానని  కమల తెలిపింది. పలుసార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 

భర్త చేతిలో మోసపోయానని తెలిసిన కమల, గత్యంతరం లేక వెంటనే ఇంటికి ఫోన్ చేసి తన కుటుంబానికి అక్కడి పరిస్థితి తెలిపింది. ఇండియాకి రప్పించడానికి, ఆమె బంధువులు ఏజెంట్ రవికి 70వేలు ఇవ్వగా, డబ్బుతీసుకుని అతను మోసం చేశాడు. దీంతో కమలను మస్కట్ నుంచి రప్పించడానికి.. ఆమె కుటుంబసభ్యులు ఎంపీ కవిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని కలిశారు. వారి సహాకారంతో తాను స్వదేశానికి వచ్చానని బాధితురాలు తెలిపింది. 

English Title
woman-sad-story-muscat

MORE FROM AUTHOR

RELATED ARTICLES