సన్నీ లియోన్ నిజ జీవితం.. నెట్టింట్లో చూసేద్దామా!

Submitted by arun on Mon, 03/12/2018 - 11:55
 Sunny Leone

శృంగార తారగా ఎదిగి.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయిన హాట్ బేబ్ సన్నీ లియోన్ నిజ జీవితాన్ని ఆన్ స్క్రీన్ పై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వెబ్ సిరీస్ రూపంగా.. అభిమానులను సన్నీ లియోన్ పలకరించబోతున్నట్టు వార్తలు కన్ఫమ్ అయ్యాయి.

సన్నీ అసలు పేరు.. కరణ్ జీత్ కౌర్. అందుకే.. కరణ్ జీత్ పేరుతోనే.. వెబ్ సిరీస్ రూపొందించబోతున్నారట. అందులో.. సన్నీ నిజ జీవిత కీలక సంఘటనలు అన్నీ.. సిరీస్ వైజ్ గా అందివ్వబోతున్నారట. కెనడా నుంచి తాను ఎందుకు తిరిగి వచ్చిందీ.. కరణ్ జీత్ పేరును సన్నీ లియోన్ గా ఎందుకు మార్చుకుందీ.. ఇంకా తన జీవితంలో ఎలాంటి కీలక ఘట్టాలు ఉన్నాయి.. అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నట్టు సన్నీ లియోన్.. స్వయంగా ట్వీట్ చేసింది.

దీంతో.. సన్నీ లియోన్ నిజ జీవితంలో ఎలా ఉండేదో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఆమె రోల్ ను ఎవరు పోషించబోతున్నారన్నదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English Title
Web Series On Sunny Leone

MORE FROM AUTHOR

RELATED ARTICLES