కొహ్లీలో ఆ కసి ఏమైంది.. మాయమైందా!! మాడిపోయిందా?

కొహ్లీలో ఆ కసి ఏమైంది.. మాయమైందా!! మాడిపోయిందా?
x
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి....హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి అవినాభావ సంబంధమే ఉంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో...

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి....హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి అవినాభావ సంబంధమే ఉంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన సింగిల్ టెస్ట్ మ్యాచ్‌లో... అజేయ డబుల్ సెంచరీ సాధించిన కొహ్లీ... విండీస్ తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 45 పరుగులు మాత్రమే సాధించి అవుటయ్యాడు.

విరాట్ కొహ్లీ....భారత క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న మొనగాడు. టెస్ట్ క్రికెట్...వన్డే క్రికెట్ అన్నతేడా లేకుండా పరుగులహోరు, సెంచరీల జోరు కొనసాగిస్తున్న ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్ మన్. హైదరాబాద్ వేదికగా గత ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో...డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కొహ్లీ... ఇప్పుడు విండీస్ తో...జరుగుతున్న రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో 45 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగాడు..

రాజ్ కోట వేదికగా ముగిసిన తొలిటెస్ట్ లో విండీస్ పై 139 పరుగులతో....తన కెరియర్ లో 24వ టెస్ట్ శతకం సాధించిన కొహ్లీ....25వ సెంచరీకి గురిపెట్టాడు. ఇప్పటి వరకూ ఆడిన 72 టెస్టుల్లో 24 శతకాలతో సహా...మొత్తం 6 వేల 286 పరుగులతో 54.66 సగటు సాధించిన రికార్డు కొహ్లీకి ఉంది. అయితే... హైదరాబాద్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో...78 బాల్స్ లో 5 బౌండ్రీలతో 45 పరుగులు సాధించిన కొహ్లీ...చివరకు విండీస్ కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో...lbwగా దొరికిపోయ.ాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 200 టెస్టుల్లో 51 సెంచరీలతో సహా 15 వేల 921 పరుగులతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కొహ్లీ మాత్రం...24 సెంచరీలు, 6వేల 286 పరుగులతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితా...21వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం...ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా ఉన్న... విరాట్ కొహ్లీ...కుదురుకోగలిగితే....హైదరాబాద్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శతకం బాది... బ్యాక్ టు బ్యాక్ సెంచరీల రికార్డు పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories