ఆ సంఘటనే కోహ్లిగా మార్చేసింది

Highlights

క్రికెటర్‌గా ఒక వ్యక్తి ఎంతో సంతోషాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ దాని వెనుక అంతులేని విషాదాలు కూడా దాగి ఉంటాయి. ఇలాంటి సంఘటన స్టార్ బ్యాట్స్‌మన్...

క్రికెటర్‌గా ఒక వ్యక్తి ఎంతో సంతోషాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ దాని వెనుక అంతులేని విషాదాలు కూడా దాగి ఉంటాయి. ఇలాంటి సంఘటన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లికి చోటు చేసుకుంది.

19 డిసెంబర్ 2006 2006లో ఢిల్లీ - కర్ణాటకల జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో 18సం.ల నునుగు మీసాల కుర్రాడు బ్యాట్ పట్టుకొని క్రీజులోకి అడుగుపెట్టాడు. నిలబడ్డాడు. ఆడుతున్నాడు. నలబై రన్స్ కొట్టగలిగాడు. సాయంత్రం అయ్యింది. నెక్ట్స్ డే తెలుస్తుంది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది. అయితే ఓడిపోయే అవకాశాలు 90శాతం ఉన్నా క్రికెట్ అభిమానుల్లో ఎక్కడో ఓ నమ్మకం ఆ కుర్రాడే ఏదో అద్భుతం సృష్టిస్తాడని. కానీ అప్పుడే విధి వింతనాటకం ఆడింది. తరువాతి రోజు ఆడే ఆట కోసం ఆ కుర్రాడు ఎదురు చూస్తుండా అంతలోనే ఫోన్. వాళ్ల నాన్నగారు చనిపోయారని. తెల్లవారితే మ్యాచ్ ఫోకస్ గా వర్క్ చేయాలి. ఫోన్ వచ్చింది నాన్నగారు చనిపోయారని. ఏం చేయాలి. రాత్రి గడిచింది. తెల్లారింది. ఇంట్లో నాన్న డెడ్ బాడీ. అతను భయలుదేరాడు. ఇంటికి కాదు. గ్రౌండ్ కి. తండ్రి మరణ వార్తను గుండెల్లోనే అదిమి పెట్టుకుని ఎలా ఆడాడంటే అభిమానులందరు అతడి బ్యాటింగ్ తో ఫిదా అయ్యారు. దాదాపు సెంచరీ దిశగా పరుగులతో మ్యాచ్ స్వరూపాన్నిమార్చేశాడు. ఢిల్లీ జట్టుకు విజయాన్నందించాడు. తన జీవితంలో ఏం ట్రాజెడీగా జరిగిందో అదే గొప్ప మోటీవేషన్ గా చేసుకోవాలనుకున్నాడు. నాన్న ఈ విజయం నీ కోసమేననుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత నాన్న అంత్యక్రియలకు భయలు దేరాడు. ఆరోజు అలా పరుగులు చేశాడు కాబట్టే ఈ రోజు ఇండియన్ క్రికెటర్ గా, కెప్టె న్ అవతారం ఎత్తాడు. అతడే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ..ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో చేజింగ్ వీరుడు. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. అటు మైదానంలోనే కాదు, బ‌యటి ప్ర‌పంచంలో త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌తో ఉంటూ విరాట్ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటాడు. ఇంతటి పాపులర్ అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ
5వేల పరుగుల క్లబ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...టెస్ట్ క్రికెట్ 5వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన భారత 11వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. హోంగ్రౌండ్ న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన ఆఖరిటెస్ట్ తొలిరోజు ఆటలో కొహ్లీ 5వేల పరుగుల మైలురాయి చేరాడు. అత్యంత వేగంగా 20 టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ గా సైతం కొహ్లీ రికార్డుల్లో చేరాడు. కొహ్లీ కేవలం 105 ఇన్నింగ్స్ లోనే ఐదువేల టెస్ట్ పరుగులు సాధించడం విశేషం. తన కెరియర్ లో 63వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కొహ్లీకి 20 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత సైతం ఉంది.
ఆరోజు పెవీలియన్ నుంచి ఇంటికి వెళ్లినట్లైతే ఈ రోజు ఇండియన్ కెప్టెన్ గా , క్రికెట్ స్టార్ గా ఎదగగలిగేవాడా..? కానీ విరాఠ్ దృఢసంకల్పం ముందు ఇవన్నీ ద్వజస్థంబం ముందు అగరొత్తులా కనిపించాయి. కాబట్టే స్టార్ గా ఎదగగలిగాడు. ఎందరో క్రికెట్ అభిమానులకు స్పూర్తి ప్రదాత అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories