ప్రోటోకాల్ పాట్లు...ప్రోటోకాల్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

x
Highlights

ప్రోటోకాల్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ వల్ల అందరితో తీరిగ్గా గడపలేకపోతున్నానని చెప్పారు. ఏ కార్యక్రమానికైనా...

ప్రోటోకాల్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ వల్ల అందరితో తీరిగ్గా గడపలేకపోతున్నానని చెప్పారు. ఏ కార్యక్రమానికైనా హాజరైనప్పుడు ముఖ్యమైన వ్యక్తులతో కాసేపు మాట్లాడలేకపోతున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ వృద్ధిలో బీమా ఇండస్ట్రీ కీలకపాత్ర పోషించాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఢిల్లీలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ శతాబ్ది వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య దేశ ప్రజలకు సరికొత్త పాలసీలు, పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వీలైనంత త్వరగా భారతదేశాన్ని పూర్తి బీమా కలిగిన దేశంగా మార్చాలన్నారు.

ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్‌కు ఎక్కువ టైం తీసుకోకుండా రికార్డ్ టైంలో పని పూర్తి చేయాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. ఈ కాలంలో డిజిటల్, ఆన్‌లైన్ సేవలే ప్రధానమైనవని చెప్పారు. రకరకాల అధికారులను కలిసే పని లేకుండా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే జరగాలన్నారు. ఈ క్రమంలో ప్రోటోకాల్‌పై.. వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories