వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు నిరాశ

వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు నిరాశ
x
Highlights

ప్రధాని హత్యకు కుట్ర కేసులో అరెస్టైన వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత...

ప్రధాని హత్యకు కుట్ర కేసులో అరెస్టైన వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొన్‌జాల్వెజ్‌, సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ హత్యకు వీరు పథకం రచించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధాని హత్యకు ఆయుధాలను సమకూర్చే బాధ్యత వరవరరావుకు అప్పగించారన్నది పుణే పోలీసుల వాదన. అయితే..ఈ వాదనను, అరెస్టులను సవాల్‌ చేస్తూ వారు పుణే కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు వారికి గృహనిర్బంధాన్ని విధించింది. దాంతో పౌరహక్కుల నేతలు ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై తీర్పునిచ్చిన సుప్రీం…వారికీ గృహనిర్బంధాన్ని మరో నాలుగు వారాల పాటు పొడగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories